టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 27 ఏళ్లుగా చెక్కుచెదరని ఒక రికార్డును బద్దలుకొట్టాడు. పాకిస్థాన్ లెజెండరీ క్రికెటర్ వసీం అక్రమ్ 27 ఏళ్ల క్రితం సృష్టించిన రికార్డును ఇప్పుడు బూమ్ బూమ్ బుమ్రా బ్రేక్ చేయడం విశేషం. SENA(సౌత్ ఆఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో తక్కువ వయసులో వంద వికెట్లు తీసిన ఆసియా క్రికెటర్‌గా వసీం అక్రమ్ పేరిట అరుదైన రికార్డు ఉంది.
వసీం అక్రమ్ సరిగ్గా 28 ఏళ్ల 230 రోజుల వయసు ఉన్నప్పుడు సేనా దేశాల్లో వంద వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఆ రికార్డును బుమ్రా 28 ఏళ్ల 211 రోజుల వయసులో సాధించాడు. దీంతో సేనా దేశాల్లో వంద వికెట్లు పడగొట్టిన అతిపిన్న వయస్కుడిగా బుమ్రా కొత్త రికార్డును నెలకొల్పాడు. అలాగే ఆసియా దేశాల నుంచి సేనా దేశాల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. తొలి స్థానంలో వసీం అక్రమ్ ఉన్నాడు. ప్రస్తుతం బుమ్రా కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో రీషెడ్యూల్ అయిన టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో పోప్ వికెట్ తీయడం ద్వారా బుమ్రా ఈ అరుదైన రికార్డును సాధించాడు.
కాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్ మంగళవారంతో చివరి రోజుకు చేరుకుంది. ఇంగ్లండ్ మరో 119 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. భారత్ విజయం సాధించాలంటే 7 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్ గెలిస్తే 2-2తో సిరీస్ సమం అవుతుంది. భారత్ గెలిచినా, మ్యాచ్ డ్రా అయినా సిరీస్ భారత్ సొంతమవుతుంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం కష్టమే. మరి ఇలాంటి పరిస్థితిలో బుమ్రా ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. మరి బుమ్రా సాధించిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝙏𝙝𝙚 𝘾𝙖𝙥𝙩𝙖𝙞𝙣. 🆕
Good luck, Jasprit Bumrah. 🤝#Edgbaston | #ENGvIND pic.twitter.com/klJ6OzAnWc
— Edgbaston (@Edgbaston) June 30, 2022