‘ది ఓవల్’ వేదికగా టీమిండియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. 157 పరుగుల భారీ ఆధిక్యంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత టీమిండియా ఓవల్ మైదానంలో టెస్టు మ్యాచ్ నెగ్గింది. ఇవన్నీ ఒకెత్తు అయితే.. భారత పేసర్ బాస్ప్రిత్ బుమ్రా మరో అరుదైన ఘనతను సాధించాడు. అత్యతం వేగంగా వంద వికెట్లు తీసిన భారత పేసర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. కపిల్ పేరిట ఉన్న రికార్డు(25 టెస్టుల్లో 100 వికెట్లు)ను బద్దలు కొట్టాడు.
టీమిండియాలో అడుగుపెట్టింది మొదలు బుమ్రా సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నాడు. ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగాల వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 99 వికెట్లకు చేరుకున్న బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్‌ను క్లీన్ బౌల్డ్ చేసి తన వందో వికెట్ చాలా స్పెషల్‌గా తీసుకున్నాడు. కేవలం 24 టెస్టుల్లోనే 100 వికెట్లు తీసి భూమ్ భూమ్ బుమ్రా ఔరా అనిపించాడు. ఓవల్ టెస్టులో తీసిన నాలుగు వికెట్లతో బుమ్రా కెరిర్‌లో 101 వికెట్లు సాధించాడు. ఉమేష్ యాదవ్ 150 వికెట్ల క్లబ్‌లో చేరడం, రోహిత్ శర్మ తన తొలి ఓవర్‌సీస్ శతకం సాధించడం కూడా ఓవల్ వేదికగానే సంభవించిన విషయం తెలిసిందే.