ఎప్పుడూ క్రికెట్ లో ఒక మాట చెప్తుంటారు.. పేస్ బౌలింగ్ చాలా ప్రమాదకరం అని. కానీ, స్వింగ్ కూడా పేస్ కు ఏమాత్రం తీసిపోదంటూ నిరూపించాడు జేసన్ బెహ్రెన్ డార్ఫ్. అతను సంధించిన ఒక డెలివరీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది ఎక్కడో కాదు బిగ్ బాష్ లీగ్ లో చోటుచేసుకుంది. ఆ డెలివరీని ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనిపించేంత అద్భుతంగా ఉంది. కన్ను మూసి తెరిచేలోగా బేల్స్ ను గాల్లో గిరాటు వేశాడు.
What a ball, Jason Behrendorff – with the new ball, he is a different beast in T20. pic.twitter.com/6bkmjHSma9
— Johns. (@CricCrazyJohns) December 22, 2021
బిగ్ బాష్ లీగ్ 2021-2022 సీజన్ లో 17వ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో పెర్త్ స్కాచర్స్ విజయం సాధించింది. అందులో కీలక పాత్ర పోషించింది మన ముంబయి ఇండియన్స్ మాజీ బౌలర్ జేసన్ బెహ్రెన్ డార్ఫ్. బెల్ బోర్న్ రెనెగేడ్స్ కు మొదటి ఓవర్లోనే బెహ్రెన్ డార్ఫ్ గట్టి షాకిచ్చాడు. అవుట్ స్వింగ్ బంతులతో విరుచుకుపడ్డాడు. రెండో బంతికే ఓపెనర్ హార్వీని పెవిలియన్ చేర్చాడు. గంటకు 132 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. అవుట్ స్వింగ్ ఫుల్ లెంగ్త్ డెలివరీని అడ్డుకోవడంలో హర్వీ విఫలమై.. డకౌట్ గా పెవిలియన్ చేరాడు. మరి, ఆ అద్భుతమైన వీడియో మీరూ చూసేయండి. జేసన్ బెహ్రెన్ డార్ఫ్ బౌలింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.