అలనాటి అందాల రాసి శ్రీదేశి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోంది. ఇప్పటికే కొన్ని హిట్ సినిమాల్లో నటించి నటిగా మంచి పేరుగా తెచ్చుకుంది. తల్లి నుంచి వచ్చిన అందంతో కుర్రకారును కట్టిపడేస్తున్న జాన్వీ.. తాజాగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. పొట్టిబట్టలతో నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. అందం వచ్చి క్రికెట్ ఆడితే ఇలానే ఉంటుందేమో, జాన్వీ ఆడితే క్రికెట్‌కే అందం వచ్చిందిగా అంటూ క్రికెట్, సినీ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ప్రొఫెషనల్ క్రికెటర్లు ఆడినట్లే మంచి టైమింగ్‌తో షాట్లు ఆడిన జాన్వీ.. ముందుకొచ్చి మరీ ఆడిన కవర్ డ్రైవ్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. వాటికి జాన్వీ వంపుసొంపులు మరింత అందాన్ని తెచ్చాయి.
జాన్వీ క్రికెట్ ప్రాక్టీస్ చూసిన ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఆస్ట్రేలియాలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియాతో పాటు జాన్వీని పంపించాలని కొంతమంది ఫ్యాన్స్ సరదాగా కామెంట్ చేస్తున్నారు. భారత్‌కు వరల్డ్ అందించే ఏకైక క్రికెటర్ జాన్వీ అంటూ పేర్కొంటున్నారు. కాగా.. క్రికెట్‌లో నెపోటిజమ్ ఉండదంటూ.. మరి కొంతమంది ట్రోలింగ్‌కు దిగుతున్నారు. కాగా.. బాలీవుడ్‌లో సీనియర్ నటీనటుల పిల్లలపై నెపోటిజమ్ అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్‌లో అలాంటి వాటికి చోటు లేదంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇంతకీ జాన్వీ ఇప్పుడు క్రికెట్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తుందనుకుంటున్నారా? తన రాబోయే సినిమా కోసం జాన్వీ క్రికెట్ నేర్చుకుంటుంది. పాత్రకు సంపూర్ణ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆమె బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. తన అప్‌కమింగ్ మూవీ ‘మిస్టర్ అండ్ మిస్సెస్ మాహీ’ కోసం జాన్వీ క్రికెట్ నేర్చుకుంటుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జీవిత భాగస్వామికి సంబంధించి ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఏడాది క్రితమే ఈ సినిమాను ప్రకటించినా.. ఇప్పుడు దాన్ని పట్టాలుఎక్కిస్తున్నారు.
Ufff What a Structure yaar🔥🤤#JanhviKapoor pic.twitter.com/nu2A2c5Bmm
— ۞ 𝑲𝒂𝒎𝒂𝒏 ۞ (@Kaman_edits) October 5, 2022
Goddess janhvi Kapoor practicing
Cricket 🥵🥵🥵If indian women’s cricket looked
Like this. I would’ve never watched
Men’s cricket ever pic.twitter.com/xADG95y0FS— it’s gonne be okay (@doesit_post) October 5, 2022
VIDEO- #JanhviKapoor spotted at her cricket practice session today❤️#MrAndMrsMahi
Via @manav22 pic.twitter.com/ZygbXvevME— Janhvi Kapoor Universe (@JanhviKUniverse) October 4, 2022
RAJKUMMAR RAO – JANHVI KAPOOR IN ‘MR AND MRS MAHI’… #GunjanSaxena team – director #SharanSharma and #JanhviKapoor – reunite for #MrAndMrsMahi with #RajkummarRao… Filming of this cricket-based story of a husband and wife commences Feb 2022… 7 Oct 2022 release. #KaranJohar pic.twitter.com/IGd73uyWEY
— taran adarsh (@taran_adarsh) November 22, 2021
Janhvi Kapoor plays cricket. 😝🙊 pic.twitter.com/QHDbn5avlS
— 𝙌𝙃𝘿 (@QHDposts) October 4, 2022
Nice footwork pic.twitter.com/6DwabUPFX8
— Out Of Context Cricket (@GemsOfCricket) October 5, 2022
ఇది కూడా చదవండి: మనకు తొక్కలో సిరీస్ విజయం.. కానీ సౌతాఫ్రికాకు అంతకుమించి మంచి జరిగింది!