‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో న్యూజిలాండ్ అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ చేరింది. 2019 వరల్డ్ కప్ ఫైనల్ నాటి పరాజయానికి బదులు తీర్చుకున్నారని అంతా అనుకున్నారు. ఇంగ్లాండ్‌పై భారీ విజయమే నమోదు చేసింది కివీస్. 166 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచినా.. కివీస్ సునాయాసంగా ఒక ఓవర్ మిగిలుండగానే విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించారంటే కివీస్ ప్రదర్శనను మెచ్చుకోవాల్సిందే. పవర్ ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ మిట్చెల్, నీషమ్ మెరుపు బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ పైనల్ చేరింది. ప్రస్తుతం అంతా నీషమ్ బ్యాటింగ్‌నే కీర్తిస్తున్నారు. 11 బంతుల్లో 3 అద్భుతమైన సిక్సులు కొట్టిన నీషమ్ అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా మ్యాచ్ కివీస్ వశం కావడంలో నీషమ్ బ్యాటింగ్ కీలకపాత్ర పోషించిందనే చెప్పాలి. కానీ, విజయం తర్వాత నీషమ్ మాత్రం సంబరాలు చేసుకోలేదు. ఇప్పుడు నెట్టింట అది హాట్ టాపిక్ గా మారింది.
ఇదీ చదవండి: 2019 వరల్డ్ కప్ ఫైనల్ లో పరాజయానికి సరైన బదులిచ్చిన న్యూజిలాండ్..
Jeemy Neesham is me whenever my guests are at my home🙂 pic.twitter.com/x9Atlp91w4
— Ict fan💙 (@Ictfan187) November 11, 2021
న్యూజిలాండ్ డగౌట్‌లో విజయం తర్వాత ప్లేయర్లు అందరూ ఆనందంతో గంతులేశారు. మైదానంలోకి పరుగులు పెట్టారు. ఒక్క నీషమ్ తప్ప.. అతను ఆ కుర్చీలోంచి లేవలేదు. ముఖంలో గెలిచాం అనే ఆనందంలేదు. మ్యాచ్ అయిపోయింది.. సెరమొనీ జరిగిపోయింది.. నీషమ్ మాత్రం ఆ కుర్చీలోంచి లేవ లేదు. అతని కళ్లల్లో 2019 వరల్డ్ కప్ సూపర్ ఓవర్ నాటి జ్ఞాపకాలే మెదులుతున్నట్లు కనిపించాయి. గప్టిల్‌తో కలిసి నీషమ్ పడిన శ్రమ ఆ రోజు వృథా అయిన విషయం తెలిసిందే. 6 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా భారీ సిక్స్ కొట్టి తన టీమ్‌కు విజయాన్ని అందిచడానికి కృషి చేసినా.. అది సాధ్యం కాకపోవడంతో అందరికంటే ఎక్కువ నీషమ్‌కే ఆ బాధ ఉంటుంది అనడంలో సందేహం లేదు. కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించినా కూడా ఇంకా అతని మదిలో ఆ జ్ఞాపకాలే మెదలడం అందరినీ ఆలోజింపచేస్తున్నాయి. అతను అలాగే కూర్చొని ఉండటం సోషల్ మీడియా ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.