నిజానికి క్రికెట్‌లో బౌలర్ల కెరీర్ బ్యాట్స్‌మెన్లతో పోల్చుకుంటే.. కొంచెం తక్కువ సమయమే ఉంటుంది. కానీ ఒక బౌలర్ దాదాపు 20 ఏళ్లుగా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నానే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి క్రికెటర్ మరొకరు లేరంటే అతిశయోక్తికాదు. ఆ బౌలర్ మరెవరో కాదు.. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్.
2003లో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆండర్సన్.. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా 20 ఏళ్ల పాటు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా.. వికెట్లు తీస్తున్నాడు. క్రికెట్ చరిత్రలో ఇలాంటి రికార్డు మరె క్రికెటర్‌కు లేదు. ఇప్పటి వరకు 168 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆండర్సన్.. 639 వికెట్లు పడగొట్టాడు. అలాగే 194 వన్డేలు ఆడి 269 వికెట్లు తీశాడు. మరి ఆండర్సన్ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తనకు జరిగిన అవమానంపై తొలిసారి నోరువిప్పిన డేవిడ్ వార్నర్