జేమ్స్ అండర్సన్.. క్రికెట్ చరిత్రలో తన కంటూ ఓ పేరును లిఖించుకున్నాడు ఈ ఇంగ్లాండ్ బౌలర్. మరీ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ పై తనదైన ముద్రను వేశాడు అండర్సన్. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో రెండు వికెట్లు తియ్యడం ద్వారా.. అరుదైన రికార్డు నెలకొల్పిన ఏకైక ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు.
జేమ్స్ అండర్సన్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్ గా కీర్తించబడుతున్న ఆటగాడు. తన ఇన్ అండ్ అవుట్ స్వింగ్ లతో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించగల సమర్థుడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను, మరెన్నోపురస్కారాలను తన ఖాతాలో వేసుకున్న జేమ్స్ అండర్సన్.. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న డే అండ్ నైట్ మ్యాచ్ లో రెండు వికెట్లు తీశాడు. దాంతో ఓ అరుదైన రికార్డు నెలకొల్పిన ఏకైక ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు. 40 ఏళ్ల అండర్సన్ ఈ ఘనత సాధించడం విశేషమనే చెప్పాలి. ఇంతకీ జిమ్మీ సాధించిన ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం.
జేమ్స్ అండర్సన్.. క్రికెట్ చరిత్రలో తన కంటూ ఓ పేరును లిఖించుకున్నాడు ఈ ఇంగ్లాండ్ బౌలర్. మరీ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ పై తనదైన ముద్రను వేశాడు అండర్సన్. వయసు పైబడుతున్న కొద్ది కుర్రాడిలా బౌలింగ్ చేస్తున్నాడు ఈ ఇంగ్లీష్ బౌలర్. ఇక ఆసిస్ బ్యాటర్లకు అండర్సన్ ఓ సింహస్వప్నం. యాషెస్ సిరీస్ లో తనదైన శైలిలో చెలరేగుతుంటాడు జిమ్మీ. ఈ క్రమంలోనే తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న డే అండ్ నైట్ తొలి టెస్ట్ లో రెండు వికెట్లు పడగొట్టాడు. దాంతో ఓ అరుదైన రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు అండర్సన్. ఆ రికార్డ్ ఏంటంటే?
గడిచిన 21 సంవత్సరాల్లో ఏడాదికి కనీసం ఒక వికెట్ అయిన తీసిన బౌలర్ గా నయా రికార్డు నెలకొల్పిన ఏకైక బౌలర్ గా నిలిచాడు. 2002లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన 40 ఏళ్ల అండర్సన్.. అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం ఒక్క వికెట్ అయినా తీస్తూ వస్తున్నాడు. ఈ రికార్డు సృష్టించిన ఏకైక బౌలర్ గా అండర్సన్ నిలిచాడు. అండర్సన్ కెరీర్ విషయానికి వస్తే..178 టెస్ట్ ల్లో 677 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 194 వన్డేల్లో 269 తీసి ఇంగ్లాండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగుతున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మెరుపు వేగంతో పరుగులు చేసింది. 9 వికెట్లకు 325 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. తొలిరోజే ఇన్ని పరుగులు చేసి డిక్లేర్ ఇవ్వడం క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. కాన్వే(17), వాగ్నర్(4) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మరి క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పిన అండర్సన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
2003
2004
2005
2006
2007
2008
2009
2010
2011
2012
2013
2014
2015
2016
2017
2018
2019
2020
2021
2022
2023James Anderson has now taken a Test wicket in each of the last 21 calendar years 🐐 pic.twitter.com/Zp9w3YEnnM
— ESPNcricinfo (@ESPNcricinfo) February 16, 2023