ఆస్ట్రేలియాపై 4-0తో యాషెస్ సిరీస్ కొల్పోయిన అనంతరం గత కొన్ని నెలలు గా ఇంగ్లాడ్ క్రికెట్ టీమ్ లో పలు రకాల మార్పులు జరిగాయి. యాషెస్ సిరీస్ కోల్పోయిన అనంతరం ఇంగ్లాడ్ జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లను టెస్ట్ జట్టు నుంచి తొలగించింది. అయితే ఈ నిర్ణయం అందరిని విస్మయాణికి గురిచేసింది. దీంతో టెస్ట్ కెప్టెన్ రూట్ తో సహా ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ పై తీవ్ర వ్యతిరేకతలు వచ్చాయి. అయితే తనను తొలగించినందుకు కౌంటీ మ్యాచ్ లో రూట్ పై అండర్సన్ ప్రతీకారం తీర్చుకున్నాడు.
జేమ్స్ ఆండర్స్ మరియు స్టువర్ట్ బ్రాడ్ లు టెస్ట్ జట్టులో చోటు కోల్పోయినప్పడి నిరాశ చెందలేదు. జట్టులోకి తిరిగి రావలని భావించారు. మంచి ఫామ్ కోసం, మరియు న్యూజిలాండ్‌తో జరగబోయే సిరీస్‌కి ఎంపికయ్యవడం కోసం కౌంటీ ఛాంపియన్‌షిప్ ను వేదికగా ఎంచుకున్నారు. మరో పక్క వెస్టిండీస్‌తో జరిగిన మరో పేలవమైన సిరీస్ తర్వాత, రూట్ కెప్టెన్‌గా రాజీనామా చేశాడు. అతని స్థానంలో బెన్ స్టోక్స్‌ని కెప్టెన్ గా నియమించారు. ఈ క్రమంలో కౌంటీ మ్యాచ్ ల్లో భాగంగా లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లంకాషైర్ తరపున ఆండర్సన్ మరియు యార్క్ షైర్ టీమ్ లో రూట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో టెస్ట్ మ్యాచ్ 4వ రోజున, అండర్సన్ అద్భుతమైన యార్కర్‌తో రూట్ క్లీన్ బౌల్డ్ చేసి ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
James Anderson bowls Joe Root 👀
Big celebs from Jimmy for that wicket!#LVCountyChamp pic.twitter.com/y4FnvUAJ3u
— LV= Insurance County Championship (@CountyChamp) May 15, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.