టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు భారీ షాక్ తగిలింది. నాలుగు సంవత్సరాల నాటి ఓ కేసు విషయంలో ఆయన భార్య రివాబాకు, ఆమె తల్లికి జామ్ నగర్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇంతకు ముందు చాలాసార్లు కోర్టుకు హాజరుకావాలని కోరినప్పటికీ వీరి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. 2018లో రోడ్డు యాక్సిడెంట్ సందర్భంగా పోలీసు కానిస్టేబుల్ దాడి కేసులో ఈ మేరకు సమన్లు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో..రాజ్ కోట్ పోలీసులు జడేజా సతీమణికి మరోసారి కోర్టు సమన్లను పంపారు.
2018లో జామ్‌నగర్‌లోని సరు సెక్షన్ రోడ్డులో రివాబా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. కానిస్టేబుల్ అహిర్ బైక్ సహా మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో బాధితులకు స్వల్ప గాయాలయ్యాయి. సదరు కానిస్టేబుల్ అహిర్.. జడేజా సతీమణిపై అత్యంత పాశవికంగా దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. రివాబా ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కానిస్టేబుల్ అహిర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కొద్ది రోజులకే అహిర్ కు బెయిల్ లభించింది. ఈ కేసుకు సంబంధించి రీవాబాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నామని, దాడికి దిగిన కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అప్పుడు ఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రివాబా, ఆమె తల్లి ఇప్పటివరకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వకపోవడంతో.. కోర్టుకు హాజరవ్వాల్సిందిగా చివసారిగా మంగళవారం(మార్చి1) సమన్లు జరీ చేసింది. రవీంద్ర జడేజా, రివాబా సోలంకీ వివాహం ఏప్రిల్ 17, 2016న రాజ్‌కోట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.ఇక టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇచ్చాక అదరగొడుతున్నాడు. రిషబ్ పంత్ కు విశ్రాంతి, గాయంతో సూర్యకుమార్ యాదవ్ దూరమవడంతో.. జడేజా నెంబర్ 5 స్థానానికికి ప్రమోషన్ అందుకున్నాడు. అవకాశాలు అంతగా రానప్పటికీ.. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో మ్యాచును అద్భుతంగా ఫినిష్ చేశాడు. ఇక ఐపీఎల్ లో రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.
🐎❤️🎱 pic.twitter.com/dRdyie1nNr
— Ravindrasinh jadeja (@imjadeja) January 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.