మిస్టర్ కూల్ గా ధోని క్రికెట్ లో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరుచుకున్నాడు. ఇప్పటివరకు మాహీ ఆటిట్యూడ్ ని మెచ్చుకున్నవారే గాని ఎవరూ కూడా బ్యాడ్ కామెంట్స్ చేయలేదు. కానీ టీమిండియా మాజీ పేస్ బౌలర్ మాత్రం ధోని అసలు కూల్ కాదని సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ప్రపంచ క్రికెట్ లో కూల్ కెప్టెన్ ఎవరంటే అందరి నోటి నుండి ఠక్కున వచ్చే మాట “మహేంద్ర సింగ్ ధోని”. ఒత్తిడిలో కూల్ గా ఉండడం ధోని స్పెషాలిటీ. తన కూల్ నెస్ తో అసాధ్యమైన ఎన్నో మ్యాచులను సుసాధ్యం చేసి చూపించాడు. దీంతో “మిస్టర్ కూల్” గా క్రికెట్ లో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నాడు. అయితే ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉండే ధోని.. గ్రౌండ్ లో కోపం తెచ్చుకున్న సందర్భాలు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పటివరకు మాహీ ఆటిట్యూడ్ ని మెచ్చుకున్నవారే గాని ఎవరూ కూడా బ్యాడ్ కామెంట్స్ చేయలేదు. కానీ టీమిండియా మాజీ పేస్ బౌలర్ ఇశాంత్ శర్మ మాత్రం ధోని అసలు కూల్ కాదని సంచలన వ్యాఖ్యలు చేసాడు.
టీమిండియా అభిమానులకి పేస్ బౌలర్ ఇశాంత్ శర్మ అంటే సుపరిచితమే. పరిమిత ఓవర్ల క్రికెట్ లో అంతగా రాణించకపోయినా టెస్టుల్లో మాత్రం తన బౌలింగ్ తో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇటీవలే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన ఇశాంత్.. మంచి కం బ్యాక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న ఇశాంత్ టిఆర్ యస్ క్లిప్స్ యు ట్యూబ్ ఛానెల్ తో సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ధోని గురించి మాట్లాడుతూ.. “మహీ భాయ్ కి చాల బలాలున్నాయి. అయితే వాటిలో కూల్ మాత్రం కానీ కాదు. ధోని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు. కానీ ధోని గ్రౌండ్ లో బూతులు తిట్టడం నేను ఒకసాటి విన్నాను. అందరూ అనుకుంటున్నంత కూల్ అయితే కాదు. ధోని చుట్టూ ఉంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చెట్లు మాత్రమే ఉండవు”. అని ఇశాంత్ చెప్పుకొచ్చాడు.
ఇక తన వ్యక్తిగతంగా ధోనితో ఉన్న అనుభవాన్ని కూడా చెప్పుకొచ్చాడు. “ఒకసారి నా ఓవర్ల కోట ముగించేసాను. ఈ సమయంలో ధోని అలసిపోయావా అని అడిగాడు. నేనెను దానికి అవును అనే సమాధానం చెప్పను. నీకు రిటైర్మెంట్ వయసు వచ్చింది. నువ్వు రిటైర్ అవ్వు అని చెప్పాడు. ఆ మాటలకు నేను షాక్ అయ్యాను. ఇక ఒకసారి ధోని వేసిన త్రోను అందుకోవడంలో విఫలమయ్యాను. పదే పదే అలాగే చేయడంతో ధోని బంతిని చేతికి వేసి కొట్టుకో అని నా వైపు కోపంగా చూసాడు”. మొత్తానికి ధోని గురించి ఎవ్వరికి తెలియని షాకింగ్ నిజాలను చెప్పి సంచలనంగా మారాడు. మరి ఇషాంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.