సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ల్లో ఆటగాళ్లు సహనం కోల్పోవడం మనం చూస్తూనే ఉంటాం. బ్యాట్స్ మెన్ భారీ షాట్స్ తో విరుచుకుపడితే.. బౌలర్ సహనం కోల్పోయి, తన నోటికి పనిచెప్తాడు. అదే విధంగా బ్యాటర్స్ కు దగ్గరగా ఉండే ఫీల్డర్లు కూడా తమ నోటికి పని చెప్పిన సందర్భాలు చాలానే చూశాం. అయితే సొంత టీమ్ ఆటగాళ్లు ఇద్దరు తిట్టుకోవడం లాంటి సంఘటలను చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి అరుదైన ఘటననే గుర్తు చేసుకున్నాడు టీమిండియా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ. 2018 లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, బుమ్రాని తిట్టబోయాడు అంటూ షాకింగ్ ఘటన గుర్తు చేశాడు.
విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్ లో ఎంత అగ్రెసీవ్ గా ఉంటాడో.. ఫీల్డింగ్ లో సైతం అలానే ఉంటాడు. అదీకాక విజయవంతమైన భారత కెప్టెన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ రన్ మెషిన్. అయితే విరాట్ కెప్టెన్సీలో జరిగిన ఓ ఘటనను తాజాగా గుర్తు చేసుకున్నాడు టీమిండియా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ. అది 2018 ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం. అయితే ఈ ఏడాదే టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు స్పీడ్ స్టర్ బుమ్రా. ఇక ఆసిస్ తో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో తన తొలి స్పెల్ లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు బుమ్రా.
దాంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చిందని, కోపంగా బుమ్రా వైపు దూసుకెళ్లబోయాడు కోహ్లీ. దాంతో ఇది గమనించిన ఇషాంత్.. విరాట్ దగ్గరికి వెళ్లి.. బుమ్రా చాలా స్మార్ట్ బౌలర్, పరిస్థితులకు అనుగుణంగా అతడు బౌలింగ్ చేయగలడు వదిలెయ అని ఇషాంత్ సూచించినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియ షిప్ లో కీలకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా ఆడటం లేదు. ఇది టీమిండియాకు ఎదురుదెబ్బగా క్రీడానిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి కోహ్లీ-బుమ్రాల ఘటను ఇషాంత్ గుర్తు చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ishant Sharma came forward to save Jasprit Bumrah from Virat Kohli’s anger, said – leave him… #INDvsSL #sports #cricket #BawaalPlayer #CFBPlayoff #indVsSri https://t.co/6wYZQn1YS3
— Tata News (@Tatacabnews) February 6, 2023