క్రీడా రంగంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ అభిమాన ఆటగాళ్లు ఏం చేస్తున్నారు.. వాళ్ల అభిరుచులు ఏంటి మెుదలగు విషయాల గురించి తెలుసుకోవడానికి యువత ఆరాటపడుతూ ఉంటారు. అలాగే వారు ఏదైన సోషల్ మీడియాలో షేర్ చేస్తే వెంటనే దాని గురించి వెతకటం ప్రారంభిస్తారు. తాజాగా ఓ భారత క్రీకెటర్ కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఆతిధ్య జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో ఓడిన టీంమిండియా తర్వాత జరిగిన టీ20 సీరిస్ ను 2-1 తో కైవసం చేసుకుంది. మూడు వన్డేల సీరిస్ లో భాగంగా ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇదిఇలా ఉండగా ప్రతీ జట్టు మ్యాచ్ కు ముందు నెట్ ప్రాక్టీస్ చేస్తుంటారు. అక్కడ జరిగే కొన్ని కొన్ని ఫన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.
అలాంటి ఫన్నీ వీడియోనే ఓ అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ20లో ఇది చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ బ్రేక్ టైంలో ఇషాన్ కిషన్, ఉమ్రాన్ మాలిక్, రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ లు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఇషాన్ రవి బిష్ణోయ్ పై నుంచి దూకే ప్రయత్నం చేశాడు. పట్టు తప్పి కింద పడిపోవడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి.
ఇషాన్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో వారు ఉపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు ‘అరెరె ఇషాన్ ఎంత పని జరిగింది.. కామెడీ కాస్త సీరియస్ అయింది’ అని అంటున్నారు. మరి ఈ ఫన్నీ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
😭😭🤌 pic.twitter.com/DNi7wHDRDz
— Priyanshu 🕊 (@PriCaasm) July 14, 2022