బంగ్లాదేశ్‌పై చివరి వన్డేలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ బాది 2022కు గుడ్‌బై చెప్పిన టీమిండియా యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. 2023కు ఒక అద్భుతమైన క్యాచ్‌తో స్వాగతం పలికాడు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసి 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 37 పరుగుల చేసి రాణించిన ఇషాన్.. వికెట్ కీపింగ్‌లో అయితే అంతకు మించి అదరగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్ లాంటి ఫాస్టెస్ట్ బౌలర్ వేస్తున్న వైడ్ బాల్స్‌ను సైతం ఇరుపక్కలకు డైవ్ చేస్తూ.. మరి ఎన్నో పరుగులను ఆపాడు. అయితే.. ఇన్నింగ్స్ ఆరంభంలో ఇషాన్ కిషన్ దాదాపు బౌండరీ లైన్ దగ్గరికి వెళ్లి పట్టిక ఒక స్కైహై క్యాచ్ మాత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.
ఉమ్రాన్ మాలిక్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ ఐదో బంతిని లంక బ్యాటర్ అసలంకా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ.. ఉమ్రాన్ మాలిక్ స్పీడ్‌కు తడబడ్డాడు, దీంతో ఆ షాట్ మిస్ టైమ్ అయి ఫైన్ లెగ్ దిశగా గాల్లోకి లేచింది. చాలా ఎత్తుకు వెళ్లిన బంతిని.. ఫైన్ లెగ్ ఫీల్డర్ అందుకోవడం కష్టమని భావించిన ఇషాన్ కిషన్.. తన కీపింగ్ స్థానం నుంచి పరిగెత్తుకుంటూ.. దాదాపు ఫైన్‌లెగ్‌లో బౌండరీకి సమీపంలో పూర్తిగా గాల్లోకి డైవ్ చేస్తూ.. ఒక అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఎక్కడో ఫైన్ లెగ్‌కు వెళ్తున్న క్యాచ్‌ను కీపర్ వెళ్లి పట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. క్రికెట్ చరిత్రలో ఇదో సూపర్ క్యాచ్‌గా నిలిచిపోతుంది. తన వద్ద ఉండే గ్లౌజ్‌లను అడ్వాంటేజ్‌గా తీసుకుని.. ఫైన్ లెగ్ ఫీల్డర్ ఒట్టి చేతులతో ఆ క్యాచ్‌ను పట్టడం కష్టమని ఆలోచించి.. తనది కాని క్యాచ్‌ను సైతం అంతరిస్క్ తీసుకుని పట్టడంపై ఇషాన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలా రెస్పాన్స్‌బులిటి తీసుకుని మరీ క్యాచ్ పట్టి.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని గుర్తు చేశావంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ధోని కూడా ఇలానే అద్భుతమైన క్యాచ్‌లు పట్టేవాడని అంటున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (37), దీపక్ హుడా(41) అక్షర్‌పటేట్(31) రాణించడంతో భారత్.. పోరాటే టార్గెట్‌ను లంక ముందు ఉంచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం 29 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక లంక బౌలిర్లలో థీక్షణ, మధుషంకా, కరుణరత్నే, డిసిల్వా, హసరంగా తలా ఒక వికెట్ తీసుకున్నారు. 163 పరుగుల లక్ష్యఛేతనకు బరిలోకి దిగిన లంకను భారత్ డెబ్యూ బౌలర్ శివమ్ మావి ఆరంభంలోనే దెబ్బ తీశాడు. తన తొలి, రెండో ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి.. టీమిండియాకు మంచి స్టార్ ఇచ్చాడు. మావీ ఇచ్చిన స్టార్ట్‌ను ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ కొనసాగించారు. ఇక చివర్లో లంక కెప్టెన్ షనక(45) పోరాడినా.. ఉమ్రాన్ స్పీడ్ ముందు నిలువలేకపోయాడు. దీంతో టీ మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగులతో విజయం సాధించింది. భారత బౌలర్లలో మావి 4, ఉమ్రాన్ 2, హర్షల్ 2 వికెట్లు తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అందుకున్న క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What a brilliant catch from Ishan Kishan 🤩🫡
📸: Disney+Hotstar#CricketTwitter #indvssl pic.twitter.com/aeOKHRwcyg
— Sportskeeda (@Sportskeeda) January 3, 2023
What a Catch Ishan Kishan 🔥#IshanKishan pic.twitter.com/gTtPYiJhvj
— आशीष सिंह (@AshishS_45) January 4, 2023
Watch: Ishan Kishan shocks Hardik Pandya with acrobatic catch, leaves fans wonderstruck in India vs Sri Lanka 1st T20I@ishankishan51 #IshanKishan #INDvSL#INDvsSL pic.twitter.com/naGKy4e1LA
— Kamlesh Swami Kotputali (@KotputaliSwami) January 4, 2023