ఇటివల బంగ్లాదేశ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో టీమిండియా 1-2తో తేడాతో ఓడింది. కానీ.. చివరి వన్డేలో యువ క్రికెటర్ ఇషాన్ కిషన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రాణించడంతో తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన బాధను మర్చిపోయారు ఇండియన్ క్రికెట్ అభిమానులు. చివరి వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్ ఏకంగా డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా చివరి వన్డేలకు దూరం కావడంతో.. ఇషాన్ కిషన్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. అనూహ్యంగా వచ్చిన ఈ ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకున్న ఇషాన్.. బంగ్లాదేశ్ బౌలర్లపై శివతాండవం ఆడాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ… ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో చర్రిత సృష్టించాడు.
అప్పటికే టీమిండియా తరఫున సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, రోహిత్ శర్మ లాంటి స్టార్లు డబుల్ సెంచరీ చేసినా.. ఇషాన్ కిషన్ వారందరి కంటే అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో అప్పటి వరకు వెస్టిండీస్ మాజీ క్రికెటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కేవలం 131 బంతుల్లోనే 24 ఫోర్లు, 10 సిక్సులతో 210 పరుగులు చేసి ఇషాన్.. భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అయితే.. ఇషాన్ 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకుని ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌ను క్రికెట్ అభిమానులు మరువకముందే.. మరో సెంచరీతో అదరగొట్టాడు ఇషాన్.
బంగ్లాదేశ్‌తో చివరి వన్డే అవ్వగానే ఇండియాకు తిరిగి వచ్చేసిన ఇషాన్ కిషన్.. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన రంజీ సీజన్‌లో పాల్గొన్నాడు. జార్ఖండ్‌కు ఆడుతూ.. కేరళతో జరుగుతున్న తొలి రంజీ మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటాడు. 195 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సులతో 132 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 475 పరుగులకు ఆలౌట్ అయింది. కేరళకు కెప్టెన్‌గా ఉన్న టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ 72 పరుగులతో, మిడిల్డార్ బ్యాటర్ అక్షయ్ చంద్రన్ 150, ఎస్ జోసెఫ్ 83, ఓపెనర్ రోహన్ ప్రేమ్ 79, మరో ఓపెనర్ రోహన్ కున్నుమ్మల 50తో రాణించారు. ఇక జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ 132, సౌరభ్ తివారి 97 పరుగులతో రాణించడంతో 340 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం కేరళ రెండో ఇన్నింగ్స్ ఆరంభించి 60 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. మరి ఈ రంజీ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
📆December 10th: Scored the fastest double century in ODIs against Bangladesh.
📆December 15th: Smashed century for Jarkhand in the first match of Ranji Trophy 2022-23.
Ishan Kishan is continuing his good form with the bat.#RanjiTrophy2023 pic.twitter.com/uGaDTceVxt
— CricTracker (@Cricketracker) December 15, 2022