టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఇటివల బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీతో చెలరేగి వన్డేల్లో ఫాస్టెస్ట్ 200 కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే టీమిండియా తరఫున ఇప్పటికే సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ డబుల్ సెంచరీలు బాదినా.. వీరికంటే వేగంగా కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి దుమ్ములేపాడు. ఈ డబుల్ సెంచరీతో ఇషాన్ కిషన్ స్టార్ క్రికెటర్‌గా మారిపోయాడు. టీ20, వన్డేల్లో ఓపెనింగ్ స్థానం కోసం తన పేరును ముందువరుసలో నిలుపుకున్నాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్‌కు వన్డేల్లో సైతం దారులు మూసుకుపోయేలా చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ తర్వాత శ్రీలంకతో ప్రారంభమయ్యే వన్డే, టీ20 సిరీస్‌కు ఇషాన్ ఎంపిక అనివార్యంగా మారింది.
బంగ్లాదేశ్‌తో చివరి వన్డే ఆడి వచ్చిన ఇషాన్ కిషన్.. రంజీలో ఆడుతూ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టాడు. దీంతో క్రికెట్ అభిమానులు అతనితో ఫొటోలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. సాధారణంగా ఇండియాకు ఆడితే చాలు.. స్టార్‌గా మారిపోయినట్లే.. అందులోనూ వన్డేల్లో డబుల్ సెంచరీతో విరుచుకుపడిన ఆటగాడికి ఫ్యాన్స్ ఉండటంలో ఎలాంటి ఆశ్చర్యంలేదు. కానీ.. ఈ అభిమానం ఇషాన్ కిషన్‌కు కోపం తెప్పించింది. ఒక అభిమాని ఆటోగ్రాఫ్ అడిగితే.. ఆటోగ్రాఫ్ ఇవ్వనని ఇషాన్ కసురుకున్నాడు. ఒక్క డబుల్ సెంచరీకే అంత పొగరు వచ్చేసింది… అభిమాని ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వనను అనేంత గర్వం ఎందుకు ఇషాన్‌కు అని కోపం తెచ్చుకోకండి.
నిజానికి.. ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడో తెలుసుకుంటే.. మీరు కూడా వెరీ గుడ్ ఇషాన్ అనక మానరు. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ అడుతున్న ఇషాన్ కిషన్ మ్యాచ్ తర్వాత కలిసిన ఒక అభిమాని.. ఆటోగ్రాఫ్ ఇవ్వని కోరాడు. తన ఫోన్ వెనుక భాగంలో ఆటోగ్రాఫ్ పెట్టాటని సూచించాడు. అయితే.. ఫోన్ తిప్పి చూస్తే.. అప్పటికే అక్కడ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటోగ్రాఫ్ ఉంది. దాని పైన ఆటోగ్రాఫ్ ఇవ్వమని అభిమాని కోరాడు. అందుకు కోపం తెచ్చుకున్న ఇషాన్.. మహీ భాయ్ ఆటోగ్రాఫ్ పైన సంతకం చేసేందుకు స్థాయి తనకు రాలేదని.. కావాలంటే ధోని అన్న సంతకం కింద.. ఆటోగ్రాఫ్ ఇవ్వమంటే ఇస్తానని అన్నాడు. ఇషాన్ నుంచి ఊహించని షాక్ తిన్న ఆ అభిమాని సైతం ధోనిపై ఇషాన్‌కు ఉన్న గౌరవానికి సంతోషిస్తూ.. ధోని ఆటోగ్రాఫ్ కిందనే ఇషాన్ ఆటోగ్రాఫ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇషాన్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“Sorry I can’t sign above @MSDhoni‘s Autograph” – Ishan Kishan ❤️pic.twitter.com/5b5yhuEC3X
— DHONI Era™ 🤩 (@TheDhoniEra) December 20, 2022