ఐపీఎల్ లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచులో స్టార్ బ్యాటర్ రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ స్థానంలో ఎవరిని ప్రకటిస్తారు అనే అనుమానం అందరిలో ఉంది. తాజాగా ఈ విషయంలో బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. రాహుల్ ప్లేస్ లో ఎవరు ఆడబోతున్నారో చెప్పేసింది.
ప్రస్తుతం భారత క్రికెట్ ప్లేయర్లు ఐపీఎల్ లో బిజీగా గడుపుతున్నారు. దీని తర్వాత ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసి ఫైనల్ ఆడాల్సి ఉంది. జూన్ 7 న జరగబోయే ఈ ఫైనల్ ఇంగ్లాండ్ వేదికగా ఒవెల్ లో జరగనుంది. ఇప్పటికే ఈ ఫైనల్ కోసం ఇరు జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్క్వాడ్ లో ఉన్నటువంటి కేఎల్ రాహుల్ ఇటీవలే గాయంతో ఐపీఎల్ తో పాటు WTC ఫైనల్ కి కూడా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రాహుల్ స్థానంలో ఎవరిని ప్రకటిస్తారు అనే అనుమానం అందరిలో ఉంది. తాజాగా ఈ విషయంలో బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. రాహుల్ ప్లేస్ లో ఎవరు ఆడబోతున్నారో చెప్పేసింది. యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కి చోటు కల్పిస్తూ అతడికి ఈ స్క్వాడ్ లో చోటు కల్పించింది.
కిషన్ టెస్టుల్లో సెలెక్ట్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా కిషన్ చోటు దక్కించుకున్నాడు. అయితే తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. గత రెండు వారల క్రితం ప్రకటించిన డబ్ల్యూటీసి స్క్వాడ్ లో కిషాన్ కి చోటు లభించలేదు. కానీ రాహుల్ కి గాయం అవ్వడంతో ఈ ప్రతీష్టాత్మక ఫైనల్లో కిషాన్ కి చోటు దక్కింది. ప్రస్తుతం భారత్ మిడిల్ ఆర్డర్ సమస్య ఎదుర్కొంటున్న నేపథ్యంలో కిషాన్ కి చోటు తుది జట్టులో చోటు కల్పిస్తారో లేదో చూడాలి. ఇప్పటికే డబ్ల్యూటీసి ఫైనల్ కి స్టార్ బౌలర్ బుమ్రాతో పాటు డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, నిలకడగా రాణించే శ్రేయాస్ అయ్యర్ దూరమైనా సంగతి తెలిసిందే. ఇక ఫాస్ట్ బౌలర్లు ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్ ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. మరి రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ కి ప్లేస్ లభించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.