సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ మాత్రమే కాదు, క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఒక సెన్సేషన్ అయ్యింది. టీ20 ర్యాకింగ్స్‌లో సూర్య దుమ్ములేపాడు. ఏకంగా టాప్ 2 బ్యాటర్‌గా అవతరించాడు. సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 74 పరుగలతో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్.. 816 పాయింట్లు సాధించాడు. దీంతో పాక్ క్రికెటర్ మొహమ్మద్ రిజ్వాన్‌ను వెనక్కు నెట్టి రెండోస్థానాన్ని అందుకున్నాడు.
సూర్య కుమార్ యాదవ్ బ్యాటుతోనే కాదు.. తనదైన పంచులతోనూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు. మంగళవారం మ్యాచ్ తర్వాత ఇషాన్ కిషన్– సూర్య కుమార్ యాదవ్ మధ్య ఓ సరదా చిట్ చాట్ నడిచింది. ఆ సందర్భంగా ఇషాన్ కిషన్ సూర్య కుమార్ యాదవ్ భార్యకు సరదా రిక్వెస్ట్ పెట్టాడు. సూర్య ఉండే మ్యాచ్‌లకు తాను హాజరుకావొద్దంటూ కోరాడు. అలా అయితేనే సూర్య కుమార్ యాదవ్ చెలరేగి ఆడుతాడంటూ చెప్పుకొచ్చాడు.
సూర్యకుమార్ యాదవ్ ఇటీవల ఆడిన రెండు భారీ ఇన్నింగ్స్ కు దేవీషా హాజరు కాలేదు. ఇంగ్లండ్ మీద సెంచరీ చేసిన సమయంలో, వెస్టిండీస్‌తో మూడో టీ20కి కూడా దేవీషా హాజరవ్వలేదు. దానిని బేస్ చేసుకుని ఇషాన్ కిషన్ ఈ ఫన్నీ రిక్వెస్ట్ ను పెట్టాడు. అయితే సూర్య కుమార్ యాదవ్ మాత్రం జీవిత భాగస్వామి అసలు ఏ మ్యాచ్ కు రావాల్సిన అవసరం లేదన్నాడు. ఆమె దగ్గరగా ఉంటే చాలు.. అదే ఎంతో ఎనర్జీ ఇస్తుందన్నాడు. తన పేరును పచ్చబొట్టు వేయించుకున్న విషయాన్ని ప్రస్తావించాడు. ఆమె ఎప్పుడూ తన హృదయానికి దగ్గరగానే ఉంటుందని వ్యాఖ్యానించాడు. సూర్య కుమార్ యాదవ్ భార్య మ్యాచ్ కు రాకపోవడమే మంచిదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.