ఇషాన్ కిషన్.. ఇండియన్ క్రికెట్‌లో ఇప్పుడితనో సంచలనం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండానే.. వన్డేల్లో డైరెక్టుగా డబుల్ సెంచరీ బాదిన ఘనడు. ఇప్పుడిప్పుడే.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి బుడిబుడి అడుగులేస్తున్న ఈ బుడ్డోడు.. ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. వన్డేలో 200 పరుగులు చేయడమే గొప్ప అనుకుంటుంటే.. దాన్ని అందరి కంటే వేగంగా చేసి ఔరా అనిపించాడు. క్రిస్ గేల్ సృష్టించిన ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డుతో పాటు, అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన రోహిత్ వర్మ వరల్డ్ రికార్డులను ఒక్క దెబ్బతో బద్దలు కొట్టాడు. 71 సెంచరీల అనుభవం ఉన్న కోహ్లీ సపోర్టుతో బంగ్లాదేశ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. పసికూనపై రెండు మ్యాచ్‌లు ఓడి సిరీస్ కోల్పోయామనే ఇండియన్ క్రికెట్ అభిమానుల బాధను ఒక్క ఇన్నింగ్స్‌తో పొగొట్టాడు.
కేవలం 131 బంతుల్లోనే 24 ఫోర్లు, 10 సిక్సులతో 210 పరుగులు చేసి.. భారత్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా.. ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, నవాజ్‌గడ్ నవాబ్ వీరేందర్ సెహ్వాగ్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ లాంటి దిగ్గజాల సరసన నిలిచాడు. అయితే.. బంగ్లా బౌలర్లను ఊచకోత కోస్తూ.. డబుల్ సెంచరీతో ఒక్కసారిగా ఇండియన్ క్రికెట్‌లో స్టార్‌గా మారిన ఇషాన్ కిషన్ జీవితంలో వివాదాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. గతంలో ఒక కేసు విషయంలో అరెస్ట్ అయి.. పోలీస్ స్టేషన్‌కు సైతం వెళ్లాడు. దాని నుంచి బయటపడి.. ఇప్పుడు ఇండియన్ క్రికెట్‌లో స్టార్‌గా మారబోతున్నాడు. అయితే.. ఇషాన్ కిషన్ ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు? తర్వాత ఎలా బయట పడ్డాడు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బీహార్ రాష్ట్రానికి చెందిన ఇషాన్ కిషన్.. బీహార్ క్రికెట్ అసోసియేషన్-బీసీసీఐ మధ్య వివాదాల నేపథ్యంలో జాతీయ జట్టుకు ఎంపిక అయ్యేందుకు పక్క రాష్ట్ర జార్ఖండ్‌కు మారాడు. సోదరుడి సలహా, తండ్రి సహకారంతో జార్ఖండ్ తరఫున తన క్రికెట్ కెరీర్‌ను మొదలుపెట్టాడు. తక్కువ కాలంలోనే రాష్ట్రస్థాయి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి.. జార్ఖండ్ తరఫున రంజీల్లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. రంజీల్లో చూపించిన అద్భుత ప్రదర్శనతో ఇషాన్‌కు ఇండియన్ అండర్-19 టీమ్‌లో స్థానం దక్కింది. 2016 అండర్-19 వరల్డ్ కప్‌కు టీమిండియాకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్‌కు సైతం దూసుకెళ్లింది. కానీ.. ఫైనల్లో విండీస్‌పై ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది.
అయితే.. ఈ వరల్డ్ కప్‌కు ముందు నుంచే అండర్-19 టీమ్ కెప్టెన్‌గా ఉన్న ఇషాన్ కిషన్‌ను.. వరల్డ్ కప్ కొన్ని రోజుల ముందు పాట్న పోలీలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇండియన్ అండర్-19 టీమ్ కెప్టెన్ అరెస్ట్ అవ్వడంతో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు వ్యక్తులతో కలిసి కారులో వెళ్తూ.. ఒక ఆటోను ఢీ కొట్టాడు ఇషాన్ కిషన్. ఆ టైమ్‌లో అతనే కార్ డ్రైవ్ చేస్తున్నాడు. కారు ఢీ కొనడంతో ఆటోలో ఉన్న వ్యక్తులు గాయపడ్డారు. అయినా కూడా ఇషాన్ కారు దిగి.. వారితో ఘర్షణకు దిగారు. దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇషాన్‌తో పాటు అతనితో ఉన్న మరో ఇద్దరి సైతం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రమాదానికి కారణం అయ్యాడని అతనిపై కేసు నమోదు చేశారు.
అనంతరం ఇషాన్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫార్మాలిటీస్ పూర్తి చేసి.. అతన్ని విడిపించుకుని వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత.. అది అనుకోకుండా జరిగిన ప్రమాదమని, తాము కావాలని చేయలేదని ఇషాన్ వివరణ ఇచ్చుకున్నట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఈ వివాదం నుంచి బయటి పడిన ఇషాన్.. అండర్-19 వరల్డ్ కప్‌కు వెళ్లి.. మంచి ప్రదర్శన కనబర్చాడు. ఇక అదే ఏడాది ఐపీఎల్ వేలంలో గుజరాత్ లైయన్స్ ఇషాన్‌ను రూ.35 లక్షలకు కొనుగోలు చేసింది. 2018లో ముంబై ఇండియన్స్ దక్కించుకోగా.. అప్పటి నుంచి ఆ టీమ్‌లో కీ ప్లేయర్‌గా మారిపోయాడు. 2022 వేలంగా ఇషాన్ కిషన్‌కు అత్యంత భారీ ధర ఇచ్చి మళ్లీ ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
What a breathtaking performance on the pitch by Ishaan!
Bravo!The fastest double century in the history of the ODI! #INDVsBAN #ishankishan pic.twitter.com/VB6qSAryCu
— Dr.Amol Kolhe (@kolhe_amol) December 10, 2022