న్యూజిలాండ్‌పై మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు మూడు టీ20ల సిరీస్ కోసం సిద్ధమవుతోంది. భారత్-కివీస్ మధ్య రాంచీ వేదికగా తొలి టీ20 శుక్రవారం రాత్రి జరగనుంది. ఈ టీ20 సిరీస్‌కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు స్టార్ పేసర్లు మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. సీనియర్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత న్యూజిలాండ్‌తో న్యూజిలాండ్‌లో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా పాండ్యా కెప్టెన్సీలోనే 1-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఈ రెండు దేశాలు టీ20 సిరీస్‌లో తలపడుతున్నాయి.
అయితే.. భారత జట్టులో చోటు కోసం యువ క్రికెటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో తుది జట్టు ఎంపిక ప్రతి మ్యాచ్‌కు ముందు ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఓపెనింగ్ స్థానాలతో పాటు, మిడిల్డార్‌లోనూ పోటీ భారీగానే ఉంది. యువ ఆటగాళ్లు అందరూ అద్భుతంగా రాణిస్తుండటంతో.. ఎవర్ని తుది జట్టులో ఆడించాలనే విషయంలో టీమ్ మెనేజ్‌మెంట్‌తో పాటు కెప్టెన్, కోచ్ తలలు పట్టుకుంటున్నారు. వన్డే జట్టు ఎంపికలో ఈ సమస్య ఉంటే.. రోహిత్, కోహ్లీ లేకపోయినా.. టీ20 టీమ్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఓపెనింగ్ స్థానాల కోసం ముగ్గురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, పృథ్వీ షా. వీరి ముగ్గురిలో పృథ్వీ షా సీనియర్ ప్లేయరే అయినా.. ప్రస్తుతం ఇషాన్, గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు.
నాలుగు వారాల వ్యవథిలో ఇద్దరూ వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదారు. గిల్ అయితే అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. చాలా రోజులుగా అతన్ని వన్డేలకు మాత్రమే పరిమితం చేసిన బీసీసీఐ ఇప్పుడు టీ20లు కూడా ఆడిస్తోంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇద్దరూ టీమ్‌లో లేకపోవడంతో.. గిల్, ఇషాన్‌కు మంచి అవకాశం దొరికింది. అలాగే.. కొన్ని ఏళ్ల కిందే టీమిండియాలోకి దూసుకొచ్చిన పృథ్వీషా.. ఆశించిన స్థాయిలో సక్సెస్‌కాలేక టీమ్‌లో స్థానం కోల్పోయాడు. మళ్లీ దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టి.. ఇటివల రంజీల్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగడంతో టీమిండియాలోకి తిరిగొచ్చాడు. అయితే.. ప్రస్తుతం గిల్ ఉన్న ఫామ్ దృష్ట్యా ఓపెనర్‌గా ఇషాన్‌కు జోడిగా అతన్నే ఆడించాలని అనుకుంటున్నట్లు తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు. పృథ్వీ షా కొంత వేచి ఉండాల్సిందేనని కుండబద్దలు కొట్టేశాడు. మరి పాండ్యా స్టేట్‌మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Captain Hardik Pandya clears air on India vs New Zealand 1st T20 opening combination 🗣️#INDvsNZ #TeamIndia #ShubmanGill #PrithviShaw #HardikPandya pic.twitter.com/Lim2X7XhSY
— InsideSport (@InsideSportIND) January 26, 2023