మిస్టర్ ఐపీఎల్ గా పేరు తెచ్చుకున్న సురేష్ రైనా.. 32 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రియులకు షాకిచ్చాడు. 2సంవత్సరాల క్రితం ధోనీ ప్రకటించిన రోజునే రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించి తప్పు చేశాడా? మిస్టర్ ఐపీఎల్ త్యాగం వృథా అయ్యిందా? అన్న వార్త నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది.ధోనీ రైనా కి ఎన్నో మ్యాచుల్లో అవకాశం ఇచ్చాడు, కొన్ని మ్యాచులకి కెప్టెన్ గా చేసే అవకాశం కల్పించాడు ధోనీ. ఇద్దరూ కలిసి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో ఆడి ఎన్నో విజయాలు అందించారు.
అంతర్జాతీయ మ్యాచుల్లో రైనా వరుసగా ఫెయిలవుతున్నా కూడా ధోనీ అవకాశాలు ఇస్తూ వచ్చాడు. ఫామ్ లో ఉన్న ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ ని సైతం పక్కన పెట్టి.. సురేష్ రైనాకు జట్టులో పెట్టుకుంటూ వచ్చాడని యువరాజ్ సింగ్ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ గా మారాయి. అలా అని రైనా ఏమీ సాధారణ ఆటగాడు కాదు. 322 అంతర్జాతీయ మ్యాచుల్లో 8 వేల పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్ లో ధోనీ, యువరాజ్ సింగ్ లతో కలిసి చాలా మ్యాచుల్లో టీమిండియాకి విజయాలు అందించాడు.
టీమిండియా తరపున ఆడే సమయంలో ఒక్క ఫోర్ కొట్టడానికి కూడా ఇబ్బంది పడేవాడు. ఐపీఎల్ లో మాత్రమే ఆడతాడు, అంతర్జాతీయ క్రికెట్ కి పనికిరాడు అని విమర్శలు చేశారు. తన గురించి ఎవరేమనుకున్నా గానీ ధోనీ విషయంలో మాత్రం రైనా చాలా పాజిటివ్ గా ఉండేవాడు. తనకి అన్ని విధాలుగా సహకరించిన ధోనీ కోసం ఏకంగా తన అంతర్జాతీయ కెరీర్ నే త్యాగం చేశాడు మిస్టర్ ఐపీఎల్. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు ధోనీ ప్రకటించిన.. కొద్ది సేపటికే రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
రిటైర్మెంట్ సమయానికి ధోనీ వయసు 37 ఏళ్ళు అయితే.. రైనా వయసు కేవలం 32 ఏళ్ళే. కేవలం ధోనీ మీద ఉన్న ప్రేమతో అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. అయితే రిటైర్మెంట్ విషయంలో ధోనీకి వచ్చినంత ఆదరణ రైనాకు దక్కలేదు. ధోనీ అనబడే సునామీ తాకిడికి రైనా అనబడే నదీ ప్రవాహం ఎవరికీ కనబడలేదు. ధోనీ రిటైర్మెంట్ అనగానే ఇటు క్రికెట్ ఆటగాళ్లు, అంతర్జాతీయంగా ఉన్న సెలబ్రిటీలు అందరూ స్పందించారు. కానీ రైనా విషయంలో పెద్దగా ఎవరూ స్పందించలేదు. ధోనీతో పాటు రిటైర్మెంట్ అవ్వడం వల్లే రైనాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు.
2020 సీజన్ లో ధోనీతో గొడవ పడిన రైనాను సరిగా ఆడడం లేదని 2021 ఐపీఎల్ సీజన్ తుది జట్టు నుంచి తప్పించారు. రైనాను 2022 మెగా వేలంలో కొనేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు రాలేదు. ఐపీఎల్ లో 5528 పరుగులు చేసి.. చెన్నై సూపర్ కింగ్స్ కి మూడు సార్లు కప్పు దక్కడంలో కీలక పాత్ర పోషించిన రైనాని కొనుగోలు చేయకపోవడం నిజంగా అవమానమే. ధోనీ తలచుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రైనాకు చోటు దక్కేది. కానీ ధోనీ రైనాని జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తి చూపకపోవడం వల్లే జట్టులో చోటు దక్కలేదు అని అందరు అనుకుంటున్నారు.
అందుకే ధోనీతో కలిసి రిటైర్మెంట్ ప్రకటించి తప్పు చేశానని రైనా తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడుతున్నాడట. అప్పుడు రిటైర్మెంట్ ప్రకటించకుండా కొనసాగి ఉంటే.. ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచులు ఆడడం, ఆడకపోవడం సెకండరీ.. భారత క్రికెటర్ గా గౌరవం ఉండేదని ఫీలవుతున్నాడట. రైనా ఫీలవుతున్నాడో లేదో గానీ రైనోసర్ అభిమానులుగా మేము ఫీలవుతున్నామని రైనా ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Happy Birthday Suresh Raina!♥️ pic.twitter.com/6mhC8Fwh2e
— RVCJ Media (@RVCJ_FB) November 27, 2022
One of the finest middle order batters from India in white ball format, he ruled IPL, played two vital knocks in the 2011 World Cup knock-outs.
Happy birthday Suresh Raina. pic.twitter.com/U50N5hwS7W
— Johns. (@CricCrazyJohns) November 26, 2022