ఇండియన్ క్రికెట్ గతిని మార్చిన కెప్టెన్.. సౌరవ్ గంగూలీ. జట్టులో యువ రక్తాన్ని నింపి, సీనియర్ జూనియర్లను కలగలిపి ముందుకు నడిపిన ట్రూ లీడర్. జహీర్ ఖాన్, హర్భనజన్ సింగ్, యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్, ధోని ఇలా మరికొంత మందికి లైఫ్ ఇచ్చింది దాదానే. కానీ.. వీళ్లకు లైఫ్ ఇచ్చిన గంగూలీనే ఒక యంగ్ టాలెంటెడ్ ప్లేయర్‌కు మాత్రం అన్యాయం చేశాడు. జట్టు కూర్పులో ఎదురైన ఇబ్బంది.. యంగ్ టాలెంట్ మొత్తం ఒకే సారి ఎగసిపడటంతో గంగూలీకి అలా చేయక తప్పలేదు.
యువ క్రికెటర్లకు కొండంత అండగా నిలబడే గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే జట్టులో చోటు కోల్పోయి మరుగున పడిన యంగ్ టాలెంటెడ్ ప్లేయరే హేమంగ్ బదాని. యువరాజ్, ధోని లాంటి ఆటగాళ్ల సరసన ఉండాల్సిన ప్లేయర్‌కు దాదా వల్ల జరిగిన నష్టం ఏంటి? అసలు అప్పుడున్న పరిస్థితులు ఏంటి? వారి గురించి తెలుసుకుందాం.. అది 2000వ సంవత్సరం.. ఆటగాడిగా, కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ టీమిండియాను శాసిస్తున్న రోజులు.
అజహరుద్దీన్ తర్వాత టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన గంగూలీ కొత్త టీమిండియాను నిర్మిస్తున్నాడు. అతనికి బీసీసీఐ పెద్దల నుంచి కూడా సంపూర్ణ మద్దతు ఉంది. భారత్ బలమైన జట్టుగా ఎదిగేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో గంగూలీ అవన్నీ తీసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో జట్టులోని చెత్తను పక్కన పెట్టి టాలెంటెడ్ యంగ్ బ్లడ్‌ను జట్టులో నింపుతున్నాడు. అప్పుడే యువరాజ్‌సింగ్, మొహమ్మద్ కైఫ్ లాంటి మెరికల్లాంటి కుర్రాళ్లును దాదా జట్టులోకి తెచ్చుకుంటున్నాడు.
వీరి కంటే కొద్ది ముందుగా హేమంగ్ బదాని అనే కుర్రాడు కూడా టీమిండియాలో ఉన్నాడు. 1976 నవంబర్ 14న చెన్నైలో పుట్టిన హేమంగ్ బదాని చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఇష్టం పెంచుకున్నాడు. 1996లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టి అద్భుతంగా రాణించాడు. దాంతో 2000వ సంవత్సరంలో అజయ్ జడేజా స్థానంలో మిడిల్డార్ బ్యాట్స్‌మెన్ కమ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. మే 30న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేతో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో 51 బంతుల్లో 35 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.
ఆ తర్వాత 2001 మార్చి 28న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బదాని తన విశ్వరూపం చూపించాడు. 98 బంతుల్లో 100 కొట్టి.. తన సత్తా ఏంటో చూపించాడు. అదే తన తొలి సెంచరీ కూడా. ఈ సెంచరీతో బదాని టీమిండియాలో స్టార్ ప్లేయర్‌గా మారాడు. కానీ.. అదే ఏడాది టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బదాని అంచనాలను అందుకోలేకపోయాడు. తన కెరీర్‌లో నాలుగు టెస్టులు ఆడిన బదాని దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో అతను వన్డే క్రికెట్‌కు మాత్రమే పరిమితం అయ్యాడు.
2003-04లో ఆస్ట్రేలియాతో జరిగిన వీబీ సిరీస్ ఫైనల్‌లో బదాని సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను అజిత్ అగార్కర్‌తో కలిసి 222 పరుగులకు చేర్చాడు. బౌలింగ్‌లో కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. కానీ ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో బదాని పోరాటం గుర్తింపు పొందలేదు. టాలెంట్ ఉంటే ఎన్ని అవకాశాలైన ఇచ్చే గంగూలీ.. బదానికి కూడా చాలా అవకాశాలే ఇచ్చాడు.
కానీ.. మిడిల్డార్‌లో యువరాజ్, మొహమ్మద్ కైఫ్‌తో బదానికి పోటీ తప్పలేదు. బ్యాటింగ్‌తోపాటు వీరిద్దరూ అద్భుతమైన ఫీల్డర్లు కావడంతో దాదా.. వారి వైపే మొగ్గు చూపాడు. దీంతో కొన్ని అవకాశాల తర్వాత 2004లో బదాని టీమిండియాలో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్)లో ఆడేందుకు బదాని నిర్ణయించుకున్నాడు. ఈ లీగ్‌ను నిషేధించిన బీసీసీఐ, అందులో ఆడిన ఆటగాళ్లపై కూడా బ్యాన్ విధించింది. దీంతో బదాని తిరిగి టీమిండియాలోకి వచ్చే అవకాశాన్ని కోల్పోయాడు.
ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కోచ్‌గా ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం బదాని తమిళనాడులోని ఒక క్లబ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా.. బదాని లాంటి ఫుల్ ఆఫ్ టాలెంటెడ్ ప్లేయర్‌కు మరికొన్ని అవకాశాలు దక్కాల్సిందని ఇప్పటికీ.. అప్పట్లో తన ఆట చూసిన వారు భావిస్తుంటారు. కష్టసమయాల్లో బదాని అడిన ఇన్నింగ్స్‌లు అలాంటివి మరి. కానీ.. యంగ్ టాలెంట్‌ను నెత్తిన పెట్టుకునే గంగూలీ ముందు చాలా ఆప్షన్స్ ఉండడం, అదే సమయంలో బదాని కొంత బ్యాడ్ ఫామ్‌లో కొనసాగడంతో టీమిండియా ఒక టాలెంటెడ్ క్రికెటర్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఇలా హేమంగ్ బదాని.. ఇండియన్ క్రికెట్‌లో ఫర్గాటెన్ హీరోగా మిగిలిపోయాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#OnThisDay 1976
Hemang Badani was born today. One of the most elegant left handed batsman came into the Indian team after Ganguly took over the charges .Still remember his wonderfully hundred against the likes of Macgrath & Dizzy -Australia in Pune in 2001.@hemangkbadani pic.twitter.com/Ht6pbIOVQF— Arnab B (@TheBongGunner) November 14, 2020