వెస్టిండీస్ టూర్ ఆఫ్ పాకిస్థాన్ లో భాగంగా రెండో వన్డేలో పాక్ 120 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. 276 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన వెస్టిండీస్.. 155 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇంత భారీ తేడాతో వెస్టిండీస్ పై మ్యాచ్ గెలిపించినా కూడా.. బాబర్ అజామ్ ను పాక్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. అదేంటి అంత ఘన విజయం సాధిస్తే తిట్టడం అనుకుంటున్నారా? ఇమాముల్ హక్ విషయంలో బాబర్ అజామ్ చేసిన పనే అందుకు కారణం.
విషయం ఏంటంటే.. బాబర్ అజామ్- ఇమాముల్ హక్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య 120 పరుగుల భాగస్వామ్యం కూడా నెలకొంది. ఇమాముల్ హక్ వెస్టిండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్న సమయంలో బాబర్ అజామ్ చేసిన తప్పుకు ఇమాముల్ రనౌట్ కావాల్సి వచ్చింది. బాబర్ చేసిన పనికి ఇమాముల్ హక్ కు కోపం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా మైదానంలోనే కెప్టెన్ పై బూతులతో విరుచుకుపడ్డాడు.
PAKISTAN CLINCH THE SERIES WITH A GAME TO GO 🇵🇰💪
What a splendid effort from the boys 👏#PAKvAUS | #KhelAbhiBaqiHai pic.twitter.com/xlpEO2LyKv
— Pakistan Cricket (@TheRealPCB) June 10, 2022
తొలి ఇన్నింగ్స్ 28వ ఓవర్ లో ఐదో బంతిని ఇమాముల్ హక్ మిడ్ వికెట్ వైపు ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. బాబర్ అజామ్ క్రీజ్ దాటి రెండు అడుగులు వేసి నిల్చుండిపోయాడు. కనీసం ఇమాముల్ వైపు తిరిగి చూడనుకూడా లేదు. ఈలోపే ఇమాముల్ హక్ సగం క్రీజ్ దాటి నాన్ స్ట్రైకర్ ఎండ్ వరకూ వచ్చేశాడు. చివర్లో బాబర్ నో అని అరవగా అప్పటికే షాయ్ హోప్ వికెట్ గిరాటేశాడు కూడా. బాబర్ అజామ్ చేసిన ఈ తప్పుతో ఇమాముల్ హక్(72)కు తన కెరీర్లో పదో వన్డే సెంచరీ మిస్ అయ్యింది.
NAWAZ IS WRECKING THE WEST INDIES 🔥#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/kLLiTWnZ77
— Pakistan Cricket (@TheRealPCB) June 10, 2022
ఇమాముల్ హక్ తర్వాత బాబర్ అజామ్ కూడా 77 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో బాబర్ అజామ్, ఇమాముల్ హక్ ఇద్దరికీ కెరీర్ లో ఆరో అర్ధశతకం కావడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతా బాబర్ అజామ్ ఇంత స్వార్థ పరుడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబర్ అజామ్ వల్లే ఇమాముల్ సెంచరీ మిస్ అయ్యిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Miscommunication results in a run out 💔@ImamUlHaq12 batted well for his 72 ✨#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/x0MVHr0e35
— Pakistan Cricket (@TheRealPCB) June 10, 2022