డేవిడ్ మిల్లర్.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అసాధారణ ప్రతిభ గల ఆటగాడు. ‘కిల్లర్ మిల్లర్’గా గుర్తింపు పొందిన ఈ విధ్వంసకర బ్యాటర్.. తనదైన రోజున ఎంతటి విధ్వంసం సృష్టించగలడో అందరకి తెలుసు. ఐపీఎల్ లో అలాంటి మరుపురాని ఇన్నింగ్స్ లు ఎన్నో ఉన్నాయి. క్రీజులో కుదురుకున్నాడంటే.. ఆరోజు రాత్రి ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కలలోకి వచ్చినట్లే. నిన్న గువహటి వేదికగా జరిగిన మ్యాచ్.. అందుకు చక్కటి ఉదాహరణ. కళ్ల ముందు కొండంత లక్ష్యమున్నా.. ఏమాత్రం అదురు.. బెదురు లేకుండా బౌండరీల వర్షం కురిపించాడు. ఆఖరకు భారత జట్టు మ్యాచ్ గెలిచినా.. ఆ ఆనందం బౌలర్లకు లేకుండా చేశాడు. ఇంతలా రాణిస్తున్నా.. అతడు సౌతాఫ్రికా జట్టులో నిత్యం అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆ వివరాలు..
మిల్లర్ అంతర్జాతీయ క్రికెట్‌లో చాలాకాలం క్రితమే(2010లో) ఎంట్రీ ఇచ్చినప్పటికి మొదట్లో అవకాశాలు ఎక్కువగా రాలేదు. దానికి కారణం లేకపోలేదు. మిల్లర్ జట్టులోకి వచ్చే సమయానికి దక్షిణాఫ్రికాలో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన అతను వెలుగులోకి రావడానికి ఐదేళ్లు పట్టింది. అది.. 2015 వన్డే వరల్డ్ కప్. ఆ వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా సెమీఫైనల్‌కు చేరింది అంటే.. అది మిల్లర్ ఇన్నింగ్స్ ల వల్లే. ఆ టోర్నీలో మిల్లర్ 324 పరుగులు సాధించాడు. ఆ తర్వాత రెగ్యులర్ సభ్యుడిగా ప్రమోషన్ పొందినప్పటికీ జట్టులో అతని స్థానం మాత్రం సుస్థిరం కావట్లేదు.
Both of David Miller’s T20I hundreds came in October, five years apart 💯💯https://t.co/QASP1BlQtN | #INDvSA pic.twitter.com/PwskHyOiJh
— ESPNcricinfo (@ESPNcricinfo) October 3, 2022
మిల్లర్ ఎన్ని పరుగులు చేసినా.. ఎన్ని గొప్ప ఇన్నింగ్స్ లు ఆడినా సెలెక్టర్లు లెక్కలోకి తీసుకోవట్లేరు. ఎప్పుడు జట్టులో ఉంటాడో.. ఎప్పుడు పీకేస్తారో.. ఎవరు ఊహించలేకపొతున్నారు. అందుకు ఆ దేశ క్రికెట్ బోర్డులో జరిగే రాజకీయాలే.. ఒక కారణమట. కుళ్లు, కుతంత్రాలతో నిండిపోయిందట. ‘జాతి వివక్ష’ కారణంగా ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న సౌతాఫ్రికా బోర్డులో ఇలాంటివి నిత్యం జరుగుతుంటాయట. ఈ మాటలు మనం చెప్తున్నవి కాదు.. ఆ దేశ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మిల్లర్ పై సానుభూతి వ్యక్తం చేస్తూ ఇలా పోస్టులు పెడుతున్నారు.
Virat Kohli and Rohit Sharma appreciated David Miller ❤️#Cricket #INDvSA #IndianCricket #SouthAfrica #DavidMiller #RohitSharma #ViratKohli pic.twitter.com/4mwxMJiPI5
— CRICKETNMORE (@cricketnmore) October 2, 2022
కాగా, గువహటి వేదికగా ఇండియాతో జరిగిన రెండో టీ20లో మిల్లర్ తన ఇన్నింగ్స్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యం కళ్ల ముందు కనబడుతున్నా.. ఏ మాత్రం బెదరకుండా డికాక్ తో కలిసి స్కోరును పరుగులు పెట్టించిన తీరు అద్భుతం. 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ భారీ ఇన్నింగ్స్ తో మెరిశాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అప్పటి వరకు సూపర్ గా బౌలింగ్ చేసిన అర్ష్ దీప్ సింగ్ మిల్లర్ దెబ్బకు తేలిపోయాడు. అక్షర్ పటేల్, అశ్విన్, హర్షల్ పటేల్.. ఇలా ఎవర్నీ వదల్లేదు. చివరి 10 ఓవర్లలో సౌతాఫ్రికా 151 పరుగులు జోడించడం విశేషం. అర్ష్ దీప్ సింగ్ తొలి ఓవర్లో రెండు వికెట్లు తీసినా ఆఖరికి 4 ఓవర్లలో 63 పరుగులు సమర్పించుకున్నాడంటే.. అది మిల్లర్ మహిమే. కాగా, ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కప్ గెలవడంలోనూ మిల్లర్‌ది కీలకపాత్రే. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మిల్లర్ సౌతాఫ్రికా తరపున 143 వన్డేల్లో 3503 పరుగులు, 96 టి20ల్లో 1850 పరుగులు సాధించాడు.
This is a David Miller Appreciation Tweet™️
2nd Mastercard T201 #INDvSA | #DavidMiller pic.twitter.com/IlybobYhrC
— Star Sports (@StarSportsIndia) October 2, 2022