టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కుటుంబంతో సహా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ముంబై నుంచి దుబాయ్‌కి వెళ్తున్న క్రమంలో ప్రముఖ ఎయిర్‌లైన్స్ వల్ల తనతో పాటు భార్య, పిల్లలు సైతం గంటన్నర పాటు కౌంటర్ వద్ద ఎదురుచూడాల్సి వచ్చిందని పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై తన అధికారక ట్విట్టర్ అకౌంట్‌లో ఒక పోస్టు చేశాడు. ‘ఈ రోజు విస్తారా ఫైట్ యూకే 201లో ముంబై నుంచి దుబాయ్‌కి ప్రయాణిస్తున్న క్రమంలో చేదు అనుభవం ఎదురైంది. ముందుగానే బుక్ చేసుకున్న టిక్కెట్ క్లాస్‌ను విస్తారా సంస్థ మార్చేసింది.
దీంతో నాతో పాటు, నా భర్య, ఎనిమిది నెలల నా పసిబిడ్డ, ఐదేళ్ల చిన్నారి కౌంటర్ వద్ద గంటన్నరకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. అలాగే గ్రౌండ్ స్టాఫ్ కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు. నాలాగే మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇలానే ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఇంకొకరికి కలగకుండా చూసుకోవాలి’ అని పఠాన్ విజ్ఞప్తి చేశాడు. కాగా.. ఎక్కువ మంది ప్రయాణికులకు బుకింగ్ కన్ఫామ్ చేయడంతో ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం.
ముందస్తు సమాచారం లేకుండా ప్రయాణికుల క్లాస్‌ను తగ్గించడంతో పఠాన్‌తో పాటు మరికొంత మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. మరి పఠాన్ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు స్పందిస్తారో? లేదో చూడాలి. కాగా.. ఇర్ఫాన్ పఠాన్ 2003 నుంచి 2012 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో పలు ఫ్రాంచైజ్‌ల తరఫున 103 మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. మరి పఠాన్‌కు ఎదురైన చేదు అనుభవంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఈ స్థాయికి వచ్చానంటే.. ఎన్ని చూసి ఉంటాను: విరాట్ కోహ్లీ
Hope you notice and rectify @airvistara pic.twitter.com/IaR0nb74Cb
— Irfan Pathan (@IrfanPathan) August 24, 2022