సర్ఫరాజ్ ఖాన్.. దేశవాళీ క్రికెట్ లో మార్మోగుతున్న పేరు ఇది. అంతర్జాతీయ క్రికెట్ లో సూర్యకుమార్ యాదవ్ ఎంత ఈజీగా సిక్సర్లు కొడుతున్నాడో.. అంతే ఈజీగా సర్ఫరాజ్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో వరుస సెంచరీలతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించిన సర్ఫరాజ్, ఇప్పుడు ఇరానీ కప్‌లోనూ అదే ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఇరానీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచులో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో తొడగొట్టి మరీ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇరానీ కప్ 2022 టోర్నీలో భాగంగా రంజీ ట్రోఫీ విజేత సౌరాష్ట్రతో రెస్ట్ ఆఫ్ ఇండియా పోటీపడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌లో 98 పరుగులకే ఆలౌట్ అయ్యింది. హర్విక్ దేశాయ్, చిరాగ్ జానీ డకౌట్ కాగా స్నెల్ పటేల్ 4, ఛతేశ్వర్ పూజారా 1, షెల్డన్ జాక్సన్ 2, ప్రెరక్ మన్కండ్ 9, పార్త్ భట్ 1.. ఇలా టాప్- 6 ఆటగాళ్లు ఒకరివెంట పెవిలియన్ చేరారు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముఖేశ్ కుమార్(4/23) నాలుగు వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ సేన్(3/41), ఉమ్రాన్ మాలిక్(3/25) మూడేసి వికెట్లతో రాణించారు.
Umran Malik Sheer Pace Outswinging Yorker 🔥🥵
Bowling : 3️⃣/25 in 5.5 Overs 🔥#SRH | #OrangeArmy𓅃 | #OrangeArmy | #IPL2023 #IndvsSA | @umran_malik_01 pic.twitter.com/jSgtkPcTp0
— Orange Army (@OrangeArmyIPL) October 1, 2022
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన రెస్టాఫ్ ఇండియా, టాప్ -3 బ్యాటర్లు.. అభిమన్యూ ఈశ్వరన్(3), మయాంక్ అగర్వాల్(11), యశ్ ధుల్(5) విఫలమైనా.. సర్ఫరాజ్, విహారిల 197 పరుగుల భాగస్వామ్యంతో జట్టును పటిష్టస్థితిలో నిలిచింది. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ 19 ఫోర్లు, 2 సిక్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతనికి తోడుగా తెలుగు క్రికెటర్, హనుమ విహారి(145 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 62 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెస్టాఫ్ ఇండియా 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కాగా, ఇరానీ కప్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్‌లో ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకుముందు 1995లో ముంబైపై రెస్ట్ ఆఫ్ ఇండియా సాధించిన 99 పరుగుల రికార్డును తుడిచేసింది సౌరాష్ట్ర.
💯 for Sarfaraz Khan! 🙌 🙌
What a stunning knock this has been by the right-hander! 👏 👏
Follow the match ▶️ https://t.co/u3koKzDR7B#IraniCup | #SAUvROI | @mastercardindia pic.twitter.com/O2XeAZ91RV
— BCCI Domestic (@BCCIdomestic) October 1, 2022
Another day, another century in domestic cricket for Sarfaraz Khan 👏 pic.twitter.com/Y6XWyZ6Qgz
— CricTracker (@Cricketracker) October 1, 2022