ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు అత్యంత విజయవంతమైన జట్లు. ఇప్పటి వరకు ముంబై ఐదుసార్లు, చెన్నై నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాయి. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్‌ను గెలవలేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం ముంబై, సీఎస్‌కే కంటే ఆర్సీబీనే ముందుంది. గతేడాది అత్యధిక ప్రజాదరణ పొందిన క్రికెట్ క్లబ్‌గా ఆర్సీబీ అరుదైన ఘనతను దక్కించుకుంది.
ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో అత్యధిక ఇంట్రాక‌్షన్ జరిగిన క్రికెట్ క్లబ్‌గా గుర్తింపు పొందింది. గతేడాది ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అత్యధిక ఇంట్రాక‌్షన్ జరిపిన స్పోర్ట్స్ క్లబ్స్ జాబితాలో ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ టాప్‌లో ఉండగా.. ఎఫ్‌సీ బార్సిలోనా, రియల్ మాడ్రిడ్, చెల్సీ ఎఫ్‌సీ, పారిస్ సెయింట్ జర్మన్ టాప్-5లో ఉన్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 821 మిలియన్స్ ఇంట్రాక‌్షన్స్‌తో 6వ స్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ 719 మిలియన్ల ఇంట్రాక‌్షన్స్‌తో 9వ స్థానంలో నిలిచింది. ఎంగేజ్‌మెంట్ విషయంలో మాంచెస్టర్ యునైటెడ్ 2.6 బిలియన్స్‌తో టాప్‌లో ఉండగా.. ఎఫ్‌సీ బార్సిలోనా, రియల్ మాడ్రిడ్, పారీస్ సెయింట్ జర్మన్, చెల్సీ, లివర్ పూర్, గలాటసరీ టాప్-7లో ఉన్నాయి. ఇక 820 మిలియన్ల ఎంగేజ్‌మెంట్స్‌తో ఆర్సీబీ 8వ స్థానంలో ఉండగా.. 752 మిలియన్ల ఎంగేజ్‌మెంట్‌తో చెన్నై సూపర్ కింగ్స్ 9వ స్థానంలో ఉంది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కారణంగా ఆర్సీబీకి ఇంత క్రేజ్ వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఐపీఎల్ 2022లోనైనా ఆర్సీబీ టైటిల్ గెలవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఐపీఎల్ 2022 కోసం ఆర్సీబీ విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్, మొహమ్మద్ సిరాజ్‌ను రిటైన్ చేసుకుంది. కాగా ఐపీఎల్ 2022 నుంచి కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్‌గా ఉండడు. మరి ఆర్సీబీ పాపులారిటీలో టాప్ ప్లేస్‌లో ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ- రోహిత్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం! ట్వీట్స్ వైరల్!