‘ఐపీఎల్.. ఐపీఎల్.. ఐపీఎల్’ మరో మూడు నెలల్లో ప్రారంభం కానున్న ఈ టోర్నీ గురుంచి అప్పుడే చర్చ మొదలైపోయింది. ఐపీఎల్ 2023 సీజన్ కు సంబంధించి కీలక ఘట్టం ఆసన్నమైంది. నాణ్యమైన ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టే వేల వచ్చేసింది. డిసెంబర్ 23న, శుక్రవారం కోచ్చి వేదికగా ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలం జరగనుంది. ఈ వేలంలో మొత్తం 405 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలావుంచితే.. ఈ వేలంలో తెలుగు ప్రాంచైజీ అయిన సన్ రైజర్స్ వ్యూహాలేంటన్నదే అంతుచిక్కని ప్రశ్న. ఈ వేలంలో సన్ రైజర్స్ అనుసరించనున్న వ్యూహాలేంటి? ఎవరెవరిని చేజిక్కించుకోనుంది? అన్నది ఇప్పుడు చూద్దాం..
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మెగా వేలంలో కనీస అవగాహన లేకుండా ప్లేయర్లను కొనుగోలు చేయడం సన్ రైజర్స్ కు శాపంగా మారింది. కేన్ విలియమ్సన్ తో పాటు రొమారియో షెపర్డ్, నికోలస్ పూరన్ లు అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యారు. దీంతో కావ్యా పాప.. వారందరికీ గుడ్ బై చెప్పేసింది. సారధి కేన్ విలియమ్సన్ తో సహా షెపర్డ్, పూరన్, సీన్ అబాట్ లతో పాటు మొత్తంగా 12 మంది ఆటగాళ్లను వదిలించుకుంది. ఇప్పుడు ఆ డబ్బుతో నాణ్యమైన ఆటగాళ్లను వెతికే పనిలో ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. కావ్య పాప మునుపటిలా కాకుండా ఈసారి పక్కా ప్లాన్ ప్రకారం వేలంలో తన వ్యూహాలు అనుసరించనుందట.
మినీ వేలంలో పాల్గొనే 10 ఫ్రాంచైజీల వద్ద మొత్తం రూ.206.5 కోట్ల పర్స్‌మనీ ఉంది. అత్యధికంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.42.25 కోట్లు ఉండగా.. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ వద్ద రూ.32.2 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా కేకేఆర్ రూ.7.05 కోట్లు, ఆర్‌సీబీ రూ.8.75 కోట్ల డబ్బు ఉంది. మినీ వేలంలో ప్రధాన పోటీ సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్(రూ.20.55 కోట్లు), సీఎస్‌కే(రూ.20.45 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్(రూ.23.35 కోట్లు) మధ్యనే ఉండనుంది. ఈ డబ్బుతో సన్‌రైజర్స్ ఎవరెవరిని చేజిక్కించుకునే అవకాశం ఉందన్నది ఇప్పుడు చూద్దాం..
SRH have the highest purse in the bank for IPL 2023 auction#IPL2023 #IPLAuction pic.twitter.com/I1BvYGHDzJ
— CRICKETNMORE (@cricketnmore) December 22, 2022
సన్‌రైజర్స్ జట్టులో ఓపెనింగ్ స్లాట్ ఖాళీగా ఉంది. యువ క్రికేటర్ అభిషేక్ శర్మతో జతకట్టనున్న మరో ఓపెనర్ కోసమే మొదటి అన్వేషణ. ఈ రేసులో ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్, భారత యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ లు ముందున్నారు. వీరిద్దరిలో ఒకరిని చేజిక్కించుకునే పనిలో ఉందట. ఇక.. రెండు, మూడు స్థానాలు రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ స్థిరం కాగా, నాలుగు, ఐదు స్థానాలను భర్తీ చేయడానికి భారీ హిట్టర్లను కొనుగోలు చేయనుందట. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ తో పాటు రిలీ రోసో, హ్యారీ బ్రూక్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ లు ఈ రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరి వైపు కావ్య పాప మగ్గుచూపుతుంది అన్నది తెలియాలంటే రేపటి వరకు వేచిచూడాల్సిందే.
మినీవేలంలో ఆటగాళ్లను సెట్‌ల వారీగా వేలం వేయనున్నారు. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను 5 సెట్లుగా విభజించారు. ఇందులో తొలి సెట్‌లో బ్యాటర్లు ఉండగా, రెండో సెట్‌లో ఆల్‌రౌండర్లు, మూడో సెట్‌లో వికెట్ కీపర్లు, నాలుగో సెట్‌లో ఫాస్ట్ బౌలర్లు, ఐదో సెట్‌లో స్పిన్నర్లను చేర్చారు.
రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్: కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్ (ఆస్ట్రేలియా); సామ్ కుర్రాన్, బెన్ స్టోక్స్, ఫిలిప్ సాల్ట్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, జామీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, టైమల్ మిల్స్(ఇంగ్లాండ్); కేన్ విలియమ్సన్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్(న్యూజిలాండ్); రిలీ రోసౌ, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్(దక్షిణాఫ్రికా); జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్( వెస్టిండీస్).
రూ. కోటిన్నర బేస్ ప్రైజ్: జై రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, రిలే మెరెడిత్, సీన్ అబాట్, నాథన్ కౌల్టర్-నైల్(ఆస్ట్రేలియా); షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్) హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జాసన్ రాయ్((ఇంగ్లాండ్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్(వెస్టిండీస్).
కోటి రూపాయల బేస్ ప్రైజ్: మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే(ఇండియా); మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్(ఆఫ్ఘనిస్తాన్); మోయిసెస్ హెన్రిక్స్, ఆండ్రూ టై(ఆస్ట్రేలియా); జో రూట్, ల్యూక్ వుడ్(ఇంగ్లాండ్); డేవిడ్ వీస్(నమీబియా); డారిల్ మిచెల్, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, మైఖేల్ బ్రేస్‌వెల్, మాట్ హెన్రీ(న్యూజిలాండ్); హెన్రిచ్ క్లాసెన్, తబ్రైజ్ షమ్సీ(దక్షిణాఫ్రికా); అకేల్ హోసేన్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్, రహ్కీమ్ కార్న్‌వాల్(వెస్టిండీస్).
వీరితో పాటు రూ. 75 లక్షలు, రూ. 50 లక్షలు, రూ. 40 లక్షలు, రూ. 30 లక్షలు, రూ. 20 లక్షలు బేస్ ప్రైస్ తో మరికొందరు ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. ఈ వేలంలో సన్‌రైజర్స్ ఎవరెవరిని చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Here’s the Indian Premier League 2023 mini-auction guide 🤩#IPL2023 #IPLT20 #IPLAuction #IPL2023Auction #IPL #MI #CSK #RR #RCB #PBKS #SRH #KKR #GT #LSG #DC #CricketTwitter pic.twitter.com/5omqo6cAcC
— SportsTiger (@StigerOfficial) December 20, 2022
Cameron Green goes for Rs 20cr in mock IPL Auction 2023 😲#Cricket #IPL2023 #iPLAuction #CameronGreen #SmaCurran #BenStokes #SRH #CSK #PBKS pic.twitter.com/0qpSqN9iUN
— CRICKETNMORE (@cricketnmore) December 22, 2022