వెస్టిండీస్ వికెట్ కీపర్, సన్‌రైజర్స్ మాజీ ఆటగాడు నికోలస్ పూరన్ మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. రూ.2 కోట్ల కనీస ధర ఉన్న అతడిని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 16 కోట్లు వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. ముందుగా రాయల్స్, చెన్నై పోటీపడగా.. అనూహ్యంగా బిడ్‌లో ఢిల్లీ వచ్చి.. అతడి ధరను అమాంతం పెంచేసింది. రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పూరన్ ధరను రూ. 5 కోట్లపైకి తీసుకెళ్లాయి. చివరికి కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో అతడిని సొంతం చేసుకుంది. గత సీజన్‌లో సన్ రైజర్స్, పూరన్ ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. అతను పెద్దగా రాణించలేదు. దీంతో అతడిని అట్టిపెట్టుకునేందుకు ఆసక్తి చూపని ఎస్ఆర్‌హెచ్ మినీ వేలానికి ముందు అతన్ని రిలీజ్ చేసింది.
ఐపీఎల్ 2022 సీజన్ లో పరుగులు చేయడానికి నానా కష్టాలు పడ్డ పూరన్, టీ20 ప్రపంచకప్‌లోనూ విఫలమయ్యాడు. అతని సారధ్యంలోని విండీస్ గ్రూప్ దశకే పరిమితమైంది. ఆ తర్వాత అతను వెస్టిండీస్ కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్నాడు. అయితే.. ఇటీవల అబుదాబి వేదికగా జరిగిన టీ10 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్‌కు సారధ్యం వహించిన పూరన్ అద్భుత ఫామ్ కనబరిచాడు. తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఆ ఆటతీరుతో ఇతడ్ని వేలంలో కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు సుముఖం వ్యక్తం చేశాయి.
A long bidding war between multiple franchises for Nicholas Pooran.
Lucknow finally lands him for Rs. 16 crore. 🔥#IPL2023Auction pic.twitter.com/3otmcGvAoN
— 100MB (@100MasterBlastr) December 23, 2022
ఇదిలావుంటే.. క్యాష్ రిచ్ లీగ్ పూరన్ వాల్యూ అంతకంతకూ పెరుగుతోంది. మొదటగా 2018 ఐపీఎల్ సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన పూరన్ ను ముంబై ఇండియన్స్ రూ. 3కోట్ల ధరకు సొంతం చేసుకుంది. ఆ తరువాత 2019, 2020, 2021 మూడు సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన పూరన్ రూ. 4.2 కోట్లు అందుకున్నాడు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదే ఎక్కువ అనుకుంటే.. తాజాగా, లక్నో సూపర్ జెయింట్స్ రూ. 16 కోట్లు వెచ్చించి మరీ అతడిని సొంతం చేసుకుంది.
There’s no stopping Nicholas Pooran in the Indian Premier League 📊
(His salary in IPL each year)#IPLAuction | @nicholas_47 pic.twitter.com/s5h0YZjv2v
— CricTracker (@Cricketracker) December 23, 2022
ఇక కొచ్చి వేదికగా జరుగుతోన్న మినీ ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆటగాళ్ల పంట పండింది. ఆల్‌రౌండర్లు సామ్ కరన్ రూ.18.50 కోట్లు పలకగా, బెన్ స్టోక్స్ రూ.16.25 కోట్లు, హ్యారీ బ్రూక్ రూ. 13.25 కోట్లు ధర పలికారు. అలాగే.. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‌ని ముంబై ఇండియన్స్ రూ.17.5 కోట్లకు దక్కించుకుంది. ఇక భారత ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్ రూ. 8.5 కోట్లకు అమ్ముడుపోయాడు. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న ఇతడిని ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది.
IPL Auction 2023 Top 10 Buys#IPLMiniAuction #punjabkings #cricket #IPLAuction #ipl2023 #auction #SamCurran #nicholaspooran #iplauction2023 #rps #MumbaiIndians #msdhoni #BenStokes pic.twitter.com/J9AhP6B8oy
— Topchand (@topchandnews) December 23, 2022