క్రికెట్ ప్రేమికులకు అలెర్ట్.. ఐపీఎల్ రూల్స్ లో మరో మార్పు జరిగింది. ఇది చెప్పుకోవడానికి చిన్న విషయంలా ఉన్నా మ్యాచ్ ఫలితాన్నే తారుమారు చేసేలా ఉంది. ఇప్పటికే.. ఇంపాక్ట్ ప్లేయర్, వైడ్.. నో బాల్‌కి రివ్యూ వంటివి ఎన్ని వివాదాలకు దారి తీస్తాయో అని భయపడుతున్న తరుణంలో మరో మార్పు జరగడం.. టోర్నీపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
ఐపీఎల్ టోర్నీ రాకతో ప్రపంచ క్రికెట్ లో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయనడంలో సందేహం లేదు. పవర్ ప్లే, ఫీల్డింగ్ మార్పులు, డీఆర్‌ఎస్, ఫ్రీ హిట్.. ఇలా అనేక మార్పులకు పునాది.. ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇవి చాలవన్నట్లు.. ఈ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్, వైడ్.. నో బాల్‌కి రివ్యూ తీసుకునే అవకాశం.. వంటి కొత్త రూల్స్ అమలు చేయనున్నారు. ఈ రూల్స్ ఎన్ని వివాదాలకు దారి తీస్తాయో అని భయపడుతుండగానే మరో మార్పు జరిగింది. చెప్పుకోవడానికి ఇది చిన్న విషయంలా ఉన్నా మ్యాచ్ ఫలితాన్నే తారుమారు చేసే అవకాశం లేకపోలేదు.
ఇప్పటివరకు టాస్ వేయకముందు తుది జట్టును ప్రకటించేవారు. టాస్‌కు వచ్చే సమయంలో ఆయా జట్ల కెప్టెన్లు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ని తీసుకొచ్చి, మ్యాచ్ రిఫరీకి ఇచ్చేవారు. కానీ, ఇకపై టాస్ వేశాక ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించనున్నారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఈ రూల్ అములులోకి రానుంది. అంటే.. టాస్ గెలిచాక జట్టు ఎంపికపై సారథులు తుది నిర్ణయం తీసుకోవచ్చు. ఈ విధానం మ్యాచ్ ఫలితాలను తారుమారు చేసే అవకాశం లేకపోలేదు. సెకండ్ బ్యాటింగ్ చేసే జట్లు.. అధిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ రూల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఇకపై ఆట.. ఫలితాన్నే ప్రభావితం చేయదు.. అంతా లక్ మీద ఆధారపడి ఉంటుందంటూ..’ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే, ఈ సీజన్ నుంచి అములు చేయనున్న ఇంపాక్ట్ ప్లేయర్‌ని కూడా టాస్ వేసిన తర్వాత ప్లేయింగ్ ఎలెవన్‌తో పాటుగానే రిఫరీకి సమర్పించాలి. ఇంపాక్ట్ ప్లేయర్, వైడ్.. నో బాల్‌కి రివ్యూ, టాస్ వేశాక ప్లేయింగ్ ఎలెవన్.. ఇలా ఎన్నో కొత్త రూల్స్ అములుచేయనున్న ఈ సీజన్ ఎన్ని వివాదాలకు కారణమవుతుందో అని నెటిజన్స్ వాపోతున్నారు. ఈ కొత్త రూల్స్‌పై.. మీ అభిప్రయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.