క్రికెట్ అభిమానులకు నాన్‌స్టాప్ అందించే వినోదం అందించే ఐపీఎల్ రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానంది. ఈ సారి ఏ జట్టు కప్పు కొడుతుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మరి వాటిలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈ సారి ఎంత బలంగా ఉందో చూద్దాం..
క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే అతి పెద్ద క్రికెట్ పండగ.. ఐపీఎల్ రానే వచ్చింది. ఇక ఇప్పటికే తమ తమ జట్లతో కలిసిపోయారు ఆటగాళ్లు. దాంతో ఇప్పుడు అభిమానులు చూపు ఐపీఎల్ టీమ్ ల బలాలు, బలహీనతలపై పడింది. ఈ క్రమంలోనే గత ఐపీఎల్ సీజన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. టైటిల్ ఎగరేసుకుపోయింది గుజరాత్ టైటాన్స్. దాంతో ఇప్పుడు అందరి చూపు మరోసారి గుజరాత్ టైటాన్స్ టీమ్ పై పడింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న గుజరాత్ ప్రధాన బలం ఏంటో.. బలహీనతలు ఏంటో ఇప్పుడు తెలుుసుకుందాం.
గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన తొలిసారే కప్ కొట్టి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో దుమ్మురేపింది. దాంతో ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ గా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది గుజరాత్. ఇక ఐపీఎల్ ప్రారంభానికి కొద్ది సమయమే ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. ఏ జట్టు బలంగా ఉంది? ఏ జట్టు బలహీనంగా ఉంది? అన్న కోణంలో వారి అంచనాలు వారు వేస్తూనే ఉన్నారు. మరి ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన సీజన్ లోనే టైటిల్ కొల్లగొట్టిన గుజరాత్ టైటాన్స్ బలాలు, బలహీనతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బలాలు..
గుజరాత్ టైటాన్స్ ప్రధాన బలం ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టీ20 సారథిగా అద్భుతమైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు పాండ్యా. ఈ పొట్టి ఫార్మాట్ లో ఒత్తిడిని ఎలా జయించాలో, మ్యాచ్ లో ఆటగాళ్లను ఎలా వాడుకోవాలో పాండ్యాకు బాగా తెలుసు. ఇక గుజరాత్ స్ట్రెంత్ లో శుభ్ మన్ గిల్, డేవిడ్ మిల్లర్, విలియమ్సన్, సాహా, మాథ్యూ వేడ్, శ్రీకర్ భరత్ లతో టాపార్డర్ బలంగా కనిపిస్తోంది. మిడిలార్డర్ లో స్టార్ ఆల్ రౌండర్స్ తో గుజరాత్ పటిష్టంగా ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, రాహుల్ తెవాతియా ఆఫ్గాన్ చిచ్చర పిడుగు రషీద్ ఖాన్, శివమ్ మావి లు ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు రెచ్చిపోయినా గుజరాత్ కు తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో సైతం గుజరాత్ పటిష్టంగానే కనిపిస్తోంది. విండీస్ సంచలనం అల్జరీ జోసెఫ్, ఐర్లాండ్ తరుపు ముక్క జోషువా లిటిల్, మహ్మద్ షమీ, ఓడియన్ స్మిత్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మలతో పాటుగా మరికొంత మంది బౌలర్లతో జట్టు సమతూకంగా కనిపిస్తోంది.
బలహీనతలు..
ఏ జట్టుకు అయిన బలాలతో పాటుగా బలహీనతలు కూడా ఉంటాయి. ఇక గుజరాత్ కు ప్రధాన బలం అయిన పాండ్యానే బలహీనంగా మారాడు. గత కొంత కాలంగా పాండ్యా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు, ఇది గుజరాత్ కు ప్రధాన సమస్యగా మారింది. విలియమ్సన్ ఫామ్ లో ఉన్నప్పటికీ అతడి గేమ్ టీ20లకు ఎంత వరకు సరితూగుతుందన్నది అనుమానమే. ఇక గుజరాత్ కు ప్రధాన బలహీనత ఏదన్నా ఉంది అంటే అంది డెత్ బౌలర్ ఎవరు అన్నదే. టైటాన్స్ కు డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ బౌలర్ ఎవరూ లేకపోవడం మైనస్ అనే చెప్పాలి. సీనియర్ బౌలర్ షమీ ఉన్నప్పటికీ అతడు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కాదు. దాంతో జోషువా లిటిల్, మోహిత్ శర్మలను ఈ విభాగంలో వాడుకోవాలని భావిస్తోంది గుజరాత్ టైటాన్స్. ఈ బలహీనతలను అధిగమించి రెండోసారి ఐపీఎల్ కప్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది పాండ్యా సేన. మరి రెండోసారి గుజరాత్ కప్ కొడుతుందా? లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
We’re coming home #TitansFam! Thunder, lightning, storm #AavaDe pic.twitter.com/Fgg5OUfPIs
— Gujarat Titans (@gujarat_titans) March 6, 2023