ఐపీఎల్ 2023 సమరానికి ఢిల్లీ క్యాపిటల్స్ సంసిద్ధమైంది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ లేని ఒక పెద్ద లోటుతో ఢిల్లీ బరిలోకి దిగనుంది. అయితే పంత్ స్థానంలో వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరి వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ బలం ఏంటో బలహీనతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నమెగా క్రికెట్ జాతర ఐపీఎల్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఫోర్లు, సిక్సర్లతో ధనాధన్ గేమ్ తో క్రికెట్ లవర్స్ ను సంతోషంలో ముంచెత్తనుంది ఈసారి ఐపీఎల్. దాంతో అభిమానుల్లో ఏ జట్టు బలంగా ఉంది. ఏ జట్టు బలహీనంగా ఉంది అన్న చర్చ ఇప్పటికే మెుదలైంది. అయితే ఈసారి ఐపీఎల్ మినీ వేలం ద్వారా దాదాపుగా అన్ని జట్లు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసి పటిష్టంగా మారాయి. ఈ క్రమంలోనే ప్రమాదం కారణంగా ఈ ఐపీఎల్ కు దూరం అయిన పంత్ సారథ్యం వహించిన.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బలం ఏంటో! బలహీనతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ ప్రారంభం నుంచి కప్ కొట్టాలని తెగ ఆరాటపడుతోంది. కానీ 15 ఐపీఎల్ సీజన్లలో ఒక్కసారి కూడా కప్ కాదు కదా కనీసం ఫైనల్ వరకు కూడా చేరుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం ఢిల్లీ జట్టు భీకరంగా కనిపిస్తోంది. స్టార్ క్రికెటర్ ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ కారు ప్రమాదం కారణంగా ఈ సీజన్ కు దూరం అయిన సంగతి తెలిసిందే. ఇది ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పవచ్చు. దాంతో ఢిల్లీ జట్టు పగ్గాలను చేపట్టాడు ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్. కెప్టెన్సీలో అనుభవం ఉన్న వార్నర్ ఢిల్లీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడో వేచి చూడాలి. అలాగే ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ కోచ్ గా ఉండటంతో ఈసారి అయినా ఢిల్లీ కప్ కొడుతుందా? లేదా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఢిల్లీ బలాలు ఎంటో.. బలహీనతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బలం..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన బలం రిషబ్ పంత్. అయితే అతడు ఈ సీజన్ కు అందుబాటులో లేకపోవడం ఢిల్లీకి భారీ ఎదురు దెబ్బ అనే చెప్పాలి. పంత్ లేకపోయినప్పటికీ ఢీల్లీ క్యాపిటల్స్ ఈసారి శత్రుదుర్భేద్యంగా కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, రైలి రూసో, పృథ్వీ షా, సర్పరాజ్ ఖాన్, రోవ్ మన్ పావెల్, అక్షర్ పటేల్, మిచెల్ మార్ష్ జట్టులో ఉండటమే. ఇక వీళ్లలో ఏ ఒక్కరు ఫామ్ లోకి వచ్చినా గానీ ప్రత్యర్థికి తిప్పలు తప్పవు. రంజీల్లో దుమ్మురేపిన సర్ఫారాజ్ ఈ సీజన్ లో అదరగొట్టి టీమిండియాలోకి రావాలని చూస్తున్నాడు. పృథ్వీ షా సైతం ఇదే ఆలోచనలతో ఉన్నాడు. అదీకాక పాంటింగ్ అనుభవం ఢిల్లీకి ప్లస్ పాయింట్ గా మారనుంది. ఆసీస్ స్టార్ బ్యాటర్ వార్నర్ ఫామ్ లోకి వస్తే ఢిల్లీకి ఇక తిరుగుండదు. బ్యాటింగ్ లో శత్రువులకు వణుకు పుట్టించే విధంగా ఉన్న ఢిల్లీ జట్టు.. బౌలింగ్ లో కూడా అంతే బలంగా కనిపిస్తోంది. నయా సంచలనం ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జై, నాగర్ కోటి, యువ సంచలనం చేతన్ సకారియాలతో పాటుగా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా ఢిల్లీ జట్టులో ఉన్నాడు.
బలహీనతలు..
ఢిల్లీ క్యాపిటల్స్ కు ఉన్న పెద్ద మైనస్ పంత్ లేకపోవడమే. అతడి స్థానంలో అంతే విధ్వంసకర ఆటగాడు ఢిల్లీ జట్టులో లేడు. పైగా ఢిల్లీకి ఉన్న ఏకైక వికెట్ కీపర్ ఫిలిఫ్ సాల్ట్ ఒక్కడే. దాంతో అతడు గాయపడితే.. ఢిల్లీ టీమ్ పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు. ఇక డేవిడ్ వార్నర్ గత కొంత కాలంగా ఫామ్ లేక తెగ ఇబ్బంది పడుతున్నాడు. పైగా కెప్టెన్ గా బాధ్యతులు ఉండనే ఉన్నాయి. ఇక బౌలింగ్ విభాగంలో ఢిల్లీ క్యాపిటల్స్ పటిష్టంగానే కనిపిస్తున్నా.. వారు ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాల్సిందే. ఢిల్లీకి పెద్దగా బలహీనతలు లేకపోయినప్పటికీ.. టోర్నీలో ఏ విధంగా రాణిస్తుందో చూడాలి మరి.
ఇక అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ లో అద్భుతంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ 16వ ఐపీఎల్ సీజన్ తో తొలికప్ కొడుతుందో? లేదో? అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్లలో ఢిల్లీ జట్టు ఆటతీరు అంత చెప్పుకొదగ్గ విధంగా లేదు. ప్రతీ సీజన్ లో అద్భతమైన ఆటగాళ్లు ఉన్నా గానీ వారి నుంచి సరైన ఆటను రాబట్టుకోలేక పోయింది ఢిల్లీ యాజమాన్యం. దాంతో ఈసారైన పటిష్టమైన జట్టు ఉంది కాబట్టి టైటిల్ కొట్టాలి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈసారి ఐపీఎల్ కప్ ఢిల్లీ క్యాపిటల్స్ కొడుతుందా? ఏ జట్టు ఈ సీజన్ కప్ ను కైవసం చేసుకుంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Level up your game to grab a spot in the playing XI 💪
📹 | Sights and sounds from our intra-squad match to get you hyped up for #IPL2023 🙌#YehHaiNayiDilli pic.twitter.com/6vNHk0Q7Ux
— Delhi Capitals (@DelhiCapitals) March 29, 2023