ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఫ్రాంచైజీలను గాయాల బెడద ఇబ్బంది పెడుతోంది. పలువురు ప్లేయర్లు ఇప్పటికే ఇంజ్యురీతో బాధపడుతూ.. సీజన్‌కు దూరమయ్యారు. ఇప్పుడు మరికొంత మంది ఆటగాళ్లు గాయాల వల్లే టోర్నీకి దూరం కానున్నట్లు సమాచారం.
ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా వారం రోజులు కూడా లేదు. అన్ని జట్లు సన్నాహకాలను మొదలుపెట్టాయి. టోర్నీకి ఎక్కువ టైమ్ లేకపోవడంతో ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని కసిమీద ఉన్నాయి. అయితే ఈ సీజన్లో గాయాల బెడద చాలా జట్లను ఇబ్బంది పెడుతోంది. గాయాల కారణంగా ఇప్పటికే పలువురు కీలక ప్లేయర్లు టోర్నీకి దూరమయ్యారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో పెద్ద మార్పు జరిగిన సంగతి విదితమే. న్యూజిలాండ్ స్పీడ్‌స్టర్ కైల్ జెమిసన్ ప్లేసులో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ సిసింద మగలను చెన్నై జట్టులోకి తీసుకున్నారు. జెమిసన్ ఇంజ్యురీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలిందని సమాచారం.
వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ముఖేష్ చౌదరి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దూరం కానున్నాడట. ఈ సీజన్ మొత్తం అతడు టీమ్‌కు దూరం కానున్నాడని సమాచారం. సీఎస్కే సీఈవో కూడా ఈ సీజన్‌కు ముఖేష్ అందుబాటులో ఉండటం కష్టమేనని చెప్పడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. అయితే ముఖేష్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనే దానిపై చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అధికారిక సమాచారం వస్తే గానీ ఏదీ చెప్పలేం. ఇకపోతే, లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఒక ప్లేయర్ దూరమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. లక్నో పేసర్ మోసిన్ ఖాన్ ఈ సీజన్ మొత్తం జట్టుకు అందుబాటులో ఉండడని సమాచారం. దీనిపై లక్నో జట్టు నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
IPLకు ముఖేష్ చౌదరీ దూరం?
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ముఖేష్ చౌదరీ ఐపీఎల్ 2023 సీజన్‌కు దూరం కానున్నట్లు సమాచారం. ఆ జట్టు సీఈఓ సైతం ఈ సీజన్‌కు ముఖేష్ అందుబాటులో ఉండటం కష్టమే అని తెలిపారు.#IPL2023 #CSK #MukeshChoudhary #SumanTV
— SumanTV (@SumanTvOfficial) March 24, 2023