క్రికెట్ అభిమానులకు నాన్‌స్టాప్ వినోదం అందించే ఐపీఎల్ 2023 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ టీమ్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత చెన్నై జట్టు బలాబలాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో ఐపీఎల్ స్టార్ట్ అవుతుందంటే ఒక్కసారిగా పండగ వాతావరణం మొదలవుతుంది. ఈ పండగ పేరే ఐపీఎల్. తొలిసారిగా 2008 లో మొదలైన ఈ మెగా లీగ్ ఇప్పటివరకు అభిమానులని అలరిస్తూనే వస్తుంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా.. ప్లేయర్లు మారిన ఐపీఎల్ క్రేజ్ మాత్రం అలాగే ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మరికొన్ని గంటల్లో ఐపీఎల్ సీజన్ 16 ప్రారంభం కానుంది. ప్రతి సీజన్ లాగే ఈ సారి కూడా ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో రేపు (శుక్రవారం) నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ టీమ్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత చెన్నై జట్టు బలాబలాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్లో అత్యంత విజయమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒకటి. ఇప్పటికే 4 ట్రోఫీలతో ముంబై ఇండియన్స్ (5) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఒకటి రెండు సీజన్లు మినహాయిస్తే దాదాపు ప్రతి సీజన్లలో కూడా చెన్నై ప్లే ఆఫ్ కి అర్హత సాధించింది. ఇందులో కెప్టెన్ ధోని పాత్ర అమోఘం. కెప్టెన్ గా ,బ్యాటర్ గా CSK టీంకి విశేషమైన సేవలను అందించాడు. ధోనితో పాటు రైనా, జడేజా బ్రేవో లాంటి ప్లేయర్లు కూడా ఈ జట్టులో తమ వంతు పాత్ర పోషించారు. 2021 లో విజేతగా నిలిచినా ధోని అండ్ కో, 2022 లో మాత్రం కనీసం ప్లే ఆఫ్ కి కూడా చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ సారి వేలంలో బెన్ స్టోక్స్ లాంటి ప్రపంచ స్థాయి ఆల్ రౌండర్ ని తీసుకొచ్చి ఈ సారి టైటిల్ మీద కనేసింది. మరి చెన్నై జట్టు ఐపీఎల్ టైటిల్ గెలిచే సత్తా ఉందా? బలాలేంటి , బలహీనతలేంటో ఇప్పుడు చూదాం.
బ్యాటింగ్ :
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బలమంతా వారి బ్యాటింగే. సీనియర్లు, జూనియర్లు, ఆల్ రౌండర్లు ఇలా జట్టులో అందరూ కూడా బ్యాటింగ్ చేయగలిగిన వారే. గైక్వాడ్, కాన్వే రూపంలో మంచి ఓపెనింగ్ జోడీ ఉండగా.. ఆల్ రౌండర్లు మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ మిడిల్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరూ టీ 20ల్లో ఎంత ప్రమాదకర బ్యాటర్లో మనం చూసే ఉంటాం. ఇక సీనియర్లు ధోని, అంబటి రాయుడు జట్టుకి కొండంత బలం. వీరితో పాటు లోయర్ ఆర్డర్ లో జడేజా తనలోని బ్యాటింగ్ స్కిల్స్ ని పెంచుకొని మంచి స్పెషలిస్ట్ బ్యాటర్ మారాడు. వీరితో పాటు దూబే, ప్రిటోరియస్, దీపక్ చాహర్, హంగర్గేకర్ కూడా బ్యాట్ ని ఝుళిపించగలరు. చూస్తూ ఉంటె బ్యాటింగ్ పరంగా పెద్దగా ఎలాంటి సమస్యలు లేనట్టే కనిపిస్తుంది. గతేడాది దాదాపు ఇలాంటి జట్టుతో విఫలమైన సూపర్ కింగ్స్ ఈ సారి ఈ మేరకు రాణిస్తుందో చూడాలి. ఈ ఏడాది వేలంలో బెన్ స్టోక్స్ ని 16.5 కోట్ల భారీ ధరకు దక్కించుకొని ఇంకాస్త బలంగా తయారైన సూపర్ కింగ్స్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తే భారీ స్కోర్ చేయడంతో పాటు టైటిల్ కూడా కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
బౌలింగ్:
ఇక బౌలింగ్ విషయానికి వస్తే చెన్నై జట్టు కాస్త బలహీనంగానే కనబడుతుంది. న్యూజిలాండ్ స్టార్ బౌలర్ జేమిసన్ గాయంతో దూరమవడం, గతేడాది రాణించిన ముకేశ్ చౌదరి ఇటీవలే అనూహ్యంగా గాయపడడంతో ఇప్పుడు చెన్నై బౌలింగ్ లో ఎలా రాణిస్తుందో ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు బెన్ స్టోక్స్ కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్ గానే కొనసాగనుండడం చెన్నైకి పెద్ద దెబ్బ. దీంతో బౌలింగ్ CSK టీమ్ కి బౌలింగ్ వనరులు బాగా తగ్గిపోయాయి. అయితే దీపక్ చాహర్ లాంటి టాప్ క్లాస్ స్వింగ్ బౌలర్ చెన్నై జట్టులో ఉండడం వారికి బలం. చాహర్ తో పాటు హంగర్గేకర్ లేదా సిమర్జీత్ సింగ్ లో ఒకరు జట్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. వీరికి అంతగా అనుభవం లేకపోయినా ధోని కెప్టెన్సీలో వీరికి చాలా స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి రాణించే అవకాశం ఉంటుంది. ఇక డెత్ బౌలర్ గా ప్రిటోరియస్ కి మంచి రికార్డు ఉంది. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా , మొయిన్ అలీ ఎంతవరకు రాణిస్తారనేది ప్రశ్నర్ధకంగా మారింది. ఎందుకంటే గత ఏడాది ఐపీఎల్లో వీరి నుంచి ఆశించిన ప్రదర్శనేమి రాలేదు. సాంట్నర్, తీక్షణ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నా వారికి తుది జట్టులో దక్కడం అనుమానమే. దీంతో ఈ ఏడాది బౌలింగ్ లో రాణించడం మీదే చెన్నై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ధోని కెప్టెన్సీ కూడా కీలకంగా మారుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మొత్తంగా బ్యాటింగ్ లో బలంగా, బౌలింగ్ లో బలహీనంగా కనిపిస్తున్న చెన్నై ఈ సారి టైటిల్ కొడుతుందో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Take it easy, Summer is going to be crazy! 😁#WhistlePodu #Yellove 🦁💛@imjadeja @msdhoni @deepak_chahar9 @reliancejio pic.twitter.com/Uhv7TJAeKj
— Chennai Super Kings (@ChennaiIPL) March 29, 2023