ఐపీఎల్ 2023 ఏమో కానీ, ఆటగాళ్లకు మాత్రం నేడు చేదు రోజే. ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు నవంబర్ 15 ఆఖరు తేదీ కావడంతో.. ఒక్కో జట్టు వదులుకున్న ఆటగాళ్ల జాబితాను బయటపెడుతున్నాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 8 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. వీరిలో ముగ్గుర ఓవర్సీస్ ఆటగాళ్లు ఉండగా, మిగిలిన వారు దేశీయ ఆటగాళ్లు. ఇక్కడివరకు బాగానే ఉన్న సీఎస్కే వదులుకున్న ఆటగాళ్లలో మ్యాచ్ విన్నర్లు ఉండటం విశేషం. ఐపీఎల్ టోర్నీలో తన ప్రస్థానం ప్రారంభమైన నాటి నుంచి చెన్నైనే అంటిపెట్టుకొని ఉన్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సైతం వేలంలోకి వదిలేసింది.. సీఎస్కే మేనేజ్మెంట్.
సీఎస్కే వదులుకున్న విదేశీ ఆటగాళ్లలో డ్వేన్ బ్రావోతో పాటు ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్‌లు ఉన్నారు. ఇక డొమెస్టిక్ ప్లేయర్స్ లో హరి నిషాంత్, నారాయణ్ జగదీషన్, కేఎం అసిఫ్, భగత్ వర్మలు ఉన్నారు. ఇక మరో ఆటగాడు రాబిన్ ఊతప్పను రిలీజ్ చేసినా.. అతడు ఇప్పటికే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక గత ఐపీఎల్ సీజన్లో కెప్టెన్‌గా నియాకమై.. అనంతరం మళ్లీ ధోనీకే నాయకత్వ పగ్గాలను వదిలేసిన రవీంద్ర జడేజాను కూడా చెన్నై రిలీజ్ చేస్తుందని భావించగా.. అతణ్ని వదులుకోబోమని ముందే సీఎస్కే సంకేతాలిచ్చింది. అన్నట్టుగానే అతణ్ని రిటైన్ చేసుకుంది.
Sending all the Yellove! We will cherish the moments we whistled as you roared in the middle! We Yellove You, Singams! 🦁💛#WhistlePoduForever
— Chennai Super Kings (@ChennaiIPL) November 15, 2022
ఇక చెన్నై రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను చూస్తే.. ఎంఎస్ ధోనీ, అంబటి రాంబాబు, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, డెవాన్ కాన్వే, డ్వెయిన్ ప్రెటోరియస్, మహీష్ థీక్షణ, మిచెల్ శాంటర్న్, మతీష పతీరన, దీపక్ చాహర్, శివమ్ దూబే, ప్రశాంత్ సోలంకి, ముకేశ్ చౌధరీ, సిమ్రజీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్, సుభరన్షు సేనాపతి ఉన్నారు. కాగా, ఐపీఎల్ 2023లో కెప్టెన్‌గా ధోనీ వ్యవహరిస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ సీజన్ తర్వాత ధోనీ రిటైరయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత టీ20ల్లో టీమిండియా బాధ్యతలను ధోనీకి బీసీసీఐ అప్పగిస్తుందని ప్రచారం జరుగుతోంది.
Whistles. Roars. Anbuden🤩
Super Returns ⏳#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/PPB5wjCEVE— Chennai Super Kings (@ChennaiIPL) November 15, 2022