ముంబయి ఇండియన్స్.. గత ఐపీఎల్ సీజన్ లలో దాదాపుగా గెలుపే లక్ష్యంగా బరిలోకి రోహిత్ శర్మ సారధ్యంలో బలమైన జట్టుగా దూసుకెళ్లింది. కానీ ఈ సీజన్ కు వచ్చేసరికి ఇప్పటికీ వరకు ఒక్క విజయాన్ని కూడా ఖతాలో వేసుకోలేక చితికిలపడిపోతోంది. ఇప్పటికీ ఆడిన అన్ని మ్యాచుల్లో ఓటమిపాలై చెత్తటీమ్ గా ముంబయి నిలుస్తోంది. అయితే బుధవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో తలపడిన ముంబయి గెలిచే మ్యాచులో సైతం ఓటమిని చవి చూసింది.
ఇక మ్యాచ్‌లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఇక అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి బ్యాటో మెన్లు దాటిగానే ప్రారంభించినా చివరికి ఓడిపోవాల్సి వచ్చింది. ఓపెనర్ రోహిత్ శర్మ (28), ఇషాన్ కిషన్ (3) రాణించలేకపోయారు. మొదటి నాలుగు ఓవర్లోనే ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు. జూనియర్ ఏబీ గా పేరు ఉన్న బ్రేవీస్ (25 బంతుల్లో 49) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక తిలక్ వర్మ (36), సూర్యకుమార్ యాదవ్ (40) తమ బ్యాట్లను ఝులిపించారు.
ఇది కూడా చదవండి: రషీద్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన SRH కోచ్ ముత్తయ్య మురళీథరన్
కానీ తర్వాత వచ్చిన పొలార్డ్ తో పాటు బ్యాట్స్ మ్యాన్లు రాణించలేకపోవడంతో చివరికి 12 పరుగుల తేడాతో ముంబయి ఓడిపోయింది. ఇదిలా ఉంటేసూర్యకుమార్ యాదవ్ తత్తరపాటు కారణంగా తిలక్ వర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో బంతిని మిడ్ వికెట్ దిశగా హిట్ చేసి సింగిల్ కోసం పిలిచిన సూర్యకుమార్ యాదవ్.. అనూహ్యంగా వెనక్కి తగ్గాడు.
దీంతో.. అప్పటికే పిచ్ మధ్యలోకి వచ్చిన తిలక్ వర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ రనౌట్ నుంచి ముంబయి తేలుకుంటుందనే లోపే కీరన్ పొలార్డ్ (10: 11 బంతుల్లో 1×4)ని కూడా సూర్యకుమార్ యాదవ్ రనౌట్ చేయించేయడం విశేషం. దీంతో బుధవారం మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ తత్తరపాటు కారణంగా ముంబయి ఓటమి పాలు కావాల్సి వచ్చిందనే విమర్శలు వచ్చిచేరుతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ చేసిన పొరపాట్లపై మీ అభిప్రాయాలను కామెట్ రూపంలో తెలియజేయండి.
Second run-out for Mumbai 😐
#IPL #IPL2022 #TATAIPL #MIvPBKS #PBKSvMI #SuryakumarYadav pic.twitter.com/CQ9rE8D835— CricBouncer (@Cricket_Bouncer) April 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.