ఐపీఎల్ 2022లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు. మంగళవారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడినా.. ఆ జట్టు స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ మాత్రం తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
4 ఓవర్లు వేసిన చాహల్ కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు విరాట్ కోహ్లీని రనౌట్ చేశాడు. తన స్పిన్ మాయజాలంతో ఆర్సీబీని భయపెట్టిన చాహల్.. విల్లేను క్లీన్‌బౌల్డ్ చేసి.. డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. అద్బుతంగా టర్న్ అయిన బంతి విల్లే బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. సూపర్ బాల్‌తో చాహల్ విల్లేను అవుట్ చేయడంతో రాజస్థాన్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు.స్టేడియం మొత్తం కరతాళధ్వనులతో మారుమోగింది. అలాగే స్టాండ్స్‌లో కూర్చోని మ్యాచ్ చూస్తున్న చాహల్ భార్య ధనశ్రీ కూడా ఆనంద పట్టలేక గంతులేసింది. చాహల్ విల్లే వికెట్ తీసిన సమయంలో ఆమె హావభావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోవడంతో ఆమె ఆనందం కొంతసేపే నిలిచింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: RCBకి రెండో గెలుపు.. ఆ ఒక్క ఓవర్ వల్లే..!
Dhanashree reaction after #yuzvendrachahal take david willey wickets #RRvsRCB pic.twitter.com/9nCYIY6GKX
— swadesh ghanekar (@swadeshLokmat) April 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.