ఐపీఎల్ 15వ ఎడిషన్ మొదలు కావడానికి కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాశాయి. లీగ్ లో ఎలా రాణించాలన్న దానిపై వ్యూహరచనలు చేస్తున్నాయి. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రెండు జట్లతో సహా.. అన్ని జట్లు తమ తమ కెప్టెన్స్ ను ప్రకటించేశాయి. అయితే.. ఇలాంటి తరుణంలో పది జట్లలో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ ని మార్చి అందరికి షాక్ ఇచ్చింది.
ఐపీఎల్ మొదటి ఎడిషన్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్.. బలమైన జట్టే. టీమ్ అంతా స్టార్స్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ.. నిలకడ లేమి వేధిస్తోంది. అడపా దడపా ఎవరో ఒకరో రాణిస్తున్నా, జట్టును విజేతగా మాత్రం నిలపలేకపోతున్నారు. ఇక ఈ జట్టుకి గత కొన్నేళ్లుగా సంజూ శాంసన్ కెప్టెన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిజానికి శాంసన్ ఒంటి చేత్తో మ్యాచును గెలిపించగల సమర్థుడు. అయితే.. కెప్టెన్ గా ఉండే ఒత్తిడి..అతని బ్యాటింగ్ పై ప్రభావం చూపుతోంది. ఈ సమయంలో కెప్టెన్ గా శాంసన్ ను తప్పిస్తూ.. తమ కొత్త సారధిగా చాహల్ ను నియమిస్తున్నట్లు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. రాయల్ పోస్ట్ చూసి అంతా షాక్ అయ్యారు.
ఇది కూడా చదవండి: కోహ్లీతో సెల్ఫీ దిగిన కుర్రాడు అరెస్ట్! ఎందుకంటే?
అంతగా అనుభవం లేకపోవడం, ఎప్పుడు మీమ్స్, ప్రాంక్స్ అంటూ.. కామెడీగా ఉండే చాహల్ ను కెప్టెన్ గా ఎలా సెలక్ట్ చేసుకున్నారబ్బా అంటూ అంతా ఆశ్చర్యపోయారు. అయితే.., కాస్త ఆలస్యంగా అసలు విషయం బయటకి వచ్చింది. చాహల్ తాజాగా రాజస్థాన్ టీమ్ తో జాయిన్ అయ్యాడు. మనోడికి ట్విట్టర్ మీద మంచి గ్రిప్ ఉండటంతో.. టీమ్ మేనేజ్మెంట్ కూడా చాహల్ కి ట్విట్టర్ లాగిన్స్ పంపించింది. మరి.. సందు దొరికితే సోషల్ మీడియాలో కామెడీ చేసే చాహల్ ఈ అవకాశాన్ని వదులుకుంటాడా? మజా తెప్పిస్తాను చూడు అంటూ.. రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తనని తాను కెప్టెన్ గా ప్రకటించుకున్నాడు. దీంతో.. ఈ పోస్ట్ చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయ్యింది. ఇదన్నమాట చాహల్ కెప్టెన్సీ విషయంలో ఉన్న అసలు ట్విస్ట్. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Meet RR new captain @yuzi_chahal 🎉 🎉 pic.twitter.com/ygpXQnK9Cv
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022
RR me twitter account me in login kar Diya hai … bola tha admin job pange mat Lena 🤣🤣 https://t.co/k3yNd6VsEx
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022