‘చెన్నై సూపర్ కింగ్స్‘.. ఐపీఎల్ టోర్నీలో 4 సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన జట్టు. 14 సీజన్లలో 9 సార్లు.. ఫైనల్ కు చేరిందంటేనే అర్థం చేసుకోవచ్చు.. చెన్నై జట్టు ఎంత బలమైందో. గ్రౌండ్ లోకి దిగితే విజయమే అన్నట్లుగా కనిపించే చెన్నై.. ఈసారి వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడితే.. ఒక్కటే గెలిచి.. ఐదు మ్యాచుల్లో ఓటమి పాలయ్యింది. ఈ వారంతో సీజన్‌లో సగం మ్యాచ్‌లు పూర్తవుతున్న నేపథ్యంలో.. చెన్నై టీమ్ పరిస్థితి ఎలా ఉందొ ఓసారి చూద్దాం!
జట్టులో సగానికి పైగా సీనియర్ ఆటగాళ్లను ఆడిస్తూ .. ‘అంకుల్స్ టీం‘గా పేరొందిన చెన్నై.. 2020లో పాయింట్ల టేబుల్ లో 7 వ స్థానంలో నిలించింది. అయితే.. గతేడాది(2021) పడిలేచిన కెరటంలా తిరిగొచ్చి ఛాంపియన్స్ గా నిలిచింది. ఇప్పుడు జడేజా నేతృత్వంలో ఐదోసారి కప్పు సాధించి.. టోర్నీలో అత్యథిక టైటిళ్లు సాధించిన ముంబయి(5)తో సమానంగా నిలవాలని చూస్తుంటే పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. వరుసగా నాలుగు ఓటముల అనంతరం ఐదో మ్యాచ్‌లో బెంగళూరుపై విజయం సాధించడంతో అందరకి ఆశలు చిగురించాయి. మళ్లీ ఆరో మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓటమిపాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై.. ప్లేఆఫ్స్ చేరుతుందా లేదా అనే అనుమానం కలుగుతోంది.
ప్లేఆఫ్స్ చేరాలంటే..
Hitting the Bull’s Eye 🎯
Into the Kings Arena for some off field target practice!#WhistlePodu #Yellove 🦁💛 @TVSEurogrip pic.twitter.com/SD3sRYyMGN— Chennai Super Kings (@ChennaiIPL) April 16, 2022
ఏ జట్టు అయినా ప్లేఆఫ్స్ చేరాలంటే కచ్చితంగా 14 నుంచి 16 పాయింట్లు కావాలి. అయితే, చెన్నై ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో ఒక్కటే గెలవడంతో.. ప్రస్తుతానికి 2 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇంకో 14 పాయింట్లు కావాలి. అంటే ఇకపై ఆడాల్సిన 8 మ్యాచుల్లో 7 గెలవాలి. ఇది సాధ్యమేనా?. చెన్నై జట్టు ప్రస్తుతం శివమ్ దూబే, రాబిన్ ఉతప్పలపైనే అధికంగా ఆధారపడుతోంది. గతేడాది టాప్ స్కోరరైన రుతురాజ్ గైక్వాడ్ దారుణంగా విఫలమవుతున్నాడు. అంబటి రాయుడు అంతంత మాత్రంగానే ఉన్నాడు. కెప్టెన్ జడేజా ఆకట్టుకోలేకపోతున్నాడు. బౌలింగ్‌లో బ్రావో, మహీష్ తీక్షణలు పర్వాలేదనిపిస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనతో.. 8 మ్యాచ్‌ల్లో 7 గెలవడమంటే మామూలు విషయం కాదు. మరి ఏయే జట్టుపై.. చెన్నై విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే..
🗣️ Gaffer’s post match thoughts!
Read more ➡️ https://t.co/S70iFcVBW5#GTvCSK #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/T4C6HhbeJe
— Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2022
Here’s to many more magical years of love! Super Anniversary to Mrs and Mr. Jadeja! 🥳💛#SuperAnniversary #WhistlePodu #Yellove 🦁💛 @imjadeja pic.twitter.com/WlMbPl7FIF
— Chennai Super Kings (@ChennaiIPL) April 17, 2022
This 🔥🔥🔥🔥 Goosebumps 🥵#CSK💛 #MI 💙 pic.twitter.com/bQti3Dz2zM
— VS (@VS_Offll) April 16, 2022
ముంబై ఇండియన్స్:
చెన్నై జట్టు తరువాత ఆడాల్సిన టీమ్ ముంబై ఇండియన్స్. ఈ జట్టుతో ఏప్రిల్ 21న ఒకటి, మే 12న మరొకటి.. 2 మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇప్పుడు ఆ జట్టు పరిస్థితి చెన్నైకంటే ఘోరంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కటీ విజయం సాధించలేదు. దీంతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉంది. దీంతో చెన్నై కాస్త కష్టపడితే ముంబయిపై రెండు విజయాలూ సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
That ‘arre bhai bhai bhai’ moment!
Jaydev hits two targets in one delivery 🎯😆#OneFamily #DilKholKe #MumbaiIndians @JUnadkat MI TV pic.twitter.com/ou2BnkYMvh
— Mumbai Indians (@mipaltan) April 19, 2022
పంజాబ్ కింగ్స్:
ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 3 ఓటములతో పర్వాలేదనిపిస్తోంది. బిగ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్, ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్‌లో బాగానే రాణిస్తున్నారు. కెప్టెన్ మయాంక్ అంతంత మాత్రంగా ఆడుతున్నా తనదైన రోజు ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తాడు. దీంతో పంజాబ్‌తో జరిగే పోరులో చెన్నై గెలవాలంటే బ్యాటింగ్‌లో లివింగ్‌స్టోన్‌ను కట్టడి చేయాలి. అలా చేస్తే సగం మ్యాచ్ గెలిచేసినట్లే.
గుజరాత్ టైటాన్స్:
ఈ సీజన్‌లో కొత్తగా వచ్చిన జట్టు గుజరాత్ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్ రాణిస్తుండటంతో ఆ జట్టు బ్యాటింగ్ యూనిట్ బలంగా ఉంది. ఇక బౌలింగ్‌లో మహ్మద్ షమి, రషీద్ ఖాన్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో చెన్నై గెలవాలంటే అన్ని విభాగాల్లో విశేషంగా రాణించాలి.
సన్ రైజర్స్ హైదరాబాద్:
ఈ సీజన్ ఆరంభంలో చెన్నైలాగే హైదరాబాద్ కూడా తడబడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన తర్వాత అనూహ్యంగా విలియమ్సన్ కూడా బాగానే ఆడుతున్నాడు. బౌలింగ్‌లో నటరాజన్, భువనేశ్వర్‌తో పాటు ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌పై గెలవాలంటే చెన్నై శక్తికి మించి పోరాడాల్సి ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్:
ప్రస్తుతానికి ఢిల్లీ జట్టు.. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 3 ఓటములతో అంతంత మాత్రంగానే ఉంది. కరోనా కేసులు ఆ జట్టును మరింత భయపెడుతున్నాయి. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా బాగానే ఆడుతున్నారు. బౌలింగ్‌లో కుల్‌దీప్ విశేషంగా రాణిస్తూ వికెట్లు తీస్తున్నాడు. ఈ మ్యాచులో చెన్నై గెలవాలంటే కుల్‌దీప్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు ఓపెనర్లను కట్టడి చేయాలి.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు:
ఈ సీజన్‌లో ఆర్సీబీ జట్టు బాగానే ఆడుతోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో దూసుకుపోతోంది. అయితే, ఇంతకుముందు చెన్నైతో ఆడిన మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడం గమనార్హం. ఇక మే 4న ఈ సీజన్‌లో చెన్నై రెండోసారి బెంగళూరుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీపై.. చెన్నైకి విజయం కష్టం కాకపోవచ్చు.
రాజస్థాన్ రాయల్స్:
రాజస్థాన్ సైతం ఈసారి బాగానే ఆడుతోంది. అందుకు ప్రధాన కారణం ఓపెనర్ జోస్ బట్లర్. ప్రస్తుతానికి బట్లర్.. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో రాజస్థాన్ జట్టు భారీ స్కోర్లు సాధించి ఇతరులను ఓడిస్తోంది. బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ మెరుస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాజస్థాన్‌తో ఆడే మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించాలంటే చెమటోడ్చక తప్పదు.
Anbirkum Undo Adaikkum Thaal! Unconditional Yellove since 2008, till Forever! 💛😍#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/yZAoGnNH3M
— Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022
మరి చెన్నై జట్టు ప్లేఆఫ్స్ చేరుతుందా..? లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.