ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. బుధవారం కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ తిలక్ వర్మ మంచి ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయినా.. తిలక్ వర్మ ఇన్నింగ్స్‌పై మరి ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో అతను కొట్టిన సిక్స్‌పై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 11 ఓవర్లలో 55 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు తిలక్ వర్మ. ఈ క్రమంలో తిలక్ వర్మ బాదిన ఓ సిక్సు నెట్టింట వైరల్‌గా మారింది.
కేకేఆర్ సీనియర్ పేసర్ ప్యాట్ కమిన్స్ వేసిన 16వ ఓవర్ తొలి బంతిని 19 ఏళ్ల తిలక్ వర్మ అద్భుతంగా సిక్సు బాదాడు. మోకాలిపై కాస్త వెనుకకు వంగి ఫైన్ లెగ్ మీదుగా అద్బుతంగా సిక్సు కొట్టాడు. తిలక్ వర్మ కొట్టిన సిక్సు దెబ్బకు బౌలింగ్ వేసిన కమిన్స్ షాక్ అయ్యాడు. కుర్రాడు నా బౌలింగ్ ఇలా కొట్టాడేంటి అన్నట్లు ఫేస్ పెట్టాడు. ముంబై ఆటగాళ్లు, అభిమానులు మాత్రం ఆ అద్భుత షాట్‌కు తిలక్ వర్మపై ప్రశంసలు కురిపించారు. నెటిజన్లు కూడా తిలక్ వర్మ టాలెంట్‌ను కొనియాడుతున్నారు.ప్రస్తుతం తిలక్ వర్మ బాదిన ఈ సిక్సు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కమిన్స్ వేసిన ఆ ఓవర్లో 6, 0,1, 4, 1తో తిలక్ వర్మ 12 పరుగులు రాబట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొని 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. మరి తిలక్ వర్మ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఒకే ఓవర్‌లో 35 పరుగులు! విధ్వంసం సృష్టించిన కమిన్స్
What a shot, Tilak. Just Wow pic.twitter.com/l7pVjnCjLq
— Johns. (@CricCrazyJohns) April 6, 2022
— Sayyad Nag Pasha (@PashaNag) April 7, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.