ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలయిన ముంబై.. రెండో మ్యాచ్‌లోనూ అదే పేలవ ప్రదర్శనను కనబర్చారు. రాజస్థాన్ నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని చేధించలేక 23 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. అయితే.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న ఈ తెలుగుతేజం శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిశాడు.
ఢిల్లీతో జరిగిన తన అరంగేట్ర మ్యాచ్‌లో చూడ ముచ్చటైన షాట్లు ఆడిన తిలక్ వర్మ 22 పరుగులు చేశాడు. రోహిత్.. అతనిపై నమ్మకముంచి రెండో మ్యాచ్‌లోనూ అవకాశం ఇచ్చాడు.. తాజా మ్యాచ్‌లో ఆ ప్రదర్శనను రెట్టింపు చేశాడు. 40 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై జట్టును తిలక్ ఆదుకున్నాడు. 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేశాడు. తిలక్ వర్మకు ఐపీఎల్‌లో ఇదే మొదటి అర్థసెంచరీ కావడం విశేషం. ముంబై ఇండియన్స్ తరపున అతి పిన్న వయస్సులో (19 ఏళ్ల 145 రోజులు) అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డు నెలకొల్పాడు.
#MIvsRR #tilak #mumbai_indians
Maiden 50 for just 19 y old talented batter TILAK VARMA……what a knock.#tilakvarma #IPL #TATAIPL pic.twitter.com/WNsEs7HoHA
— 12th man 🏏( MSD 🇮🇳❤️🏏🙅♂️) (@100crickettales) April 2, 2022
Youngest to score fifty for MI in IPL
Tilak Varma – 19 years & 145 days 🔥
Ishan Kishan – 19 years & 278 days
Ishan Kishan – 19 years & 295 days
Saurabh Tiwary – 20 years & 73 days
Saurabh Tiwary – 20 years & 77 days#TilakVarma #MIvRR #RohitSharma #IPL2022 pic.twitter.com/tPHfXq8JcQ— Sportz Point (@sportz_point) April 2, 2022
ఇది కూడా చదవండి: రోహిత్ శర్మ అవుట్.. కంటతడి పెట్టిన అభిమాని!
తెలుగు జట్టు అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తిలక్ వర్మను పట్టించుకోకపోగా ముంబై రూ.1.70 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. టాలెంట్ ఉన్న యువ ఆటగాళ్లను పట్టుకురావడంలో ముంబై ఇండియన్స్‌కు తిరుగులేదని మరోసారి నిరూపించారు. ఇక తిలక్ వర్మ ఇన్నింగ్స్ చూసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ తలబాదుకుంటుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. SRH.. ఇప్పుడైనా తెలుసుకో.. తెలుగోడి విలువ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 10 కోట్లు పెట్టి కొన్నావ్.. ఎవరైనా రాణించారా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
Then Bumrah, hardik,… And now Tilak 💪 pic.twitter.com/aIRE5oTYOi
— Buta gorira (@Sid_maymay) April 2, 2022
ఇది కూడా చదవండి: SRH అడ్మిన్ పై నెటిజన్లు సెటైర్లు.. ఉగాది స్వాగ్ అంటూ మార్కరమ్ పంచకట్టు..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోస్ బట్లర్(68 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100) సెంచరీతో చెలరేగగా.. షిమ్రాన్ హెట్‌మైర్(14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35), సంజూ శాంసన్(21 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 30)తుఫాను ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం.. 194 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేసింది. ఇషాన్ కిషన్(43 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 54), తిలక్ వర్మ(33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు.
2 wins in a row for @rajasthanroyals as they beat Mumbai Indians by 23 runs 👏👏
Scorecard ➡️ https://t.co/VsJIgyi126 #MIvRR #TATAIPL pic.twitter.com/LyxNwkv7ty
— IndianPremierLeague (@IPL) April 2, 2022