సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2022లో రెండో మ్యాచ్‌లోనూ ఓడింది. సోమవారం లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. టాస్ గెలవడం, ఆరంభంలోనే మూడు వికెట్లు పడగొట్టి లక్నోను దెబ్బతీయడంతో.. ఈ మ్యాచ్ SRHకు ఫెవర్‌గా వెళ్తున్నట్లు కనిపించినా.. చివరకు బ్యాటింగ్ వైఫల్యంతో రెండో ఓటమి తప్పలేదు. కాగా మ్యాచ్ అనంతరం SRH కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఓటమిపై మాట్లాడాడు. గత మ్యాచ్ కంటే ఈ మ్యాచ్‌లో తమ ప్రదర్శన మెరుగ్గా ఉందని చెప్పాడు. పవర్‌ప్లేలో బంతితో తమ ఆరంభం బాగుందని అన్నాడు. అయితే కేఎల్ రాహుల్, దీపక్ హుడా భాగస్వామ్యాన్ని కాస్త ముందుగా విడదీసి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఇది మంచి వికెట్ అని చెప్పిన విలియమ్సన్.. ఇక్కడ 170 పరుగులు చేయడం సవాల్‌తో కూడుకున్నదని తెలిపాడు.
అయితే ఆ లక్ష్యాన్ని చేధించే శక్తి తమకు ఉన్నప్పటికీ అది ఈ రోజ జరగలేదని చెప్పాడు. బౌలింగ్ యూనిట్ తమ పనిని చేసిందని తెలిపాడు. ఇది చిన్న మార్జిన్‌ల ఆట అని చెప్పిన విలియమ్సన్.. ప్రత్యర్థి తమ కంటే ముందుకు వెళ్లకుండా నియంత్రించడం చాలా ముఖ్యం అని చెప్పాడు. దీంతో ఫేలవ బ్యాటింగ్ కారణంగా ఈ మ్యాచ్ ఓడినట్లు కేన్ మామ ఒప్పుకున్నాడు. ఇక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో రాహుల్ 68, దీపక్ హుడా 51 పరుగులతో రాణించాడు. ఆయుష్ బదోని 19, మనీష్ పాండే 11 పరుగులు చేయగా.. మిగతా వారు రెండెంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు.
హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, షెపర్డ్, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య చేధనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి 44, నికోలస్ పూరన్ 34 పరుగులతో రాణించారు. సుందర్ 18, విలియమ్సన్ 16, అభిషేక్ శర్మ 13, మాక్రమ్ 12 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో ఆవేష్ ఖాన్ 4, హోల్డర్ 3, కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశారు. ఆవేష్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మరి సన్‌రైజర్స్ రెండో ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఒక్క మాటతో.. అందరి మనసులు గెలిచిన తెలుగు కుర్రాడు
Lucknow win by 12 runs. #SRHvLSG #OrangeArmy #ReadyToRise #TATAIPL
— SunRisers Hyderabad (@SunRisers) April 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.