ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఇరగదీసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన హైదరాబాద్.. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది వరుసగా నాలుగో పరాజయం.
టాస్ గెలిచి సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మోయిన్ అలీ (35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 48), అంబటి రాయుడు(27 బంతుల్లో 4 ఫోర్లతో 27), రవీంద్ర జడేజా(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా.. మార్క్‌రమ్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.
All the #Yellove that’s in attendance.!#CSKvSRH #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/EFTFmaPAAF
— Chennai Super Kings (@ChennaiIPL) April 9, 2022
ఇది కూడా చదవండి: కావ్య పాప పరువు తీస్తున్న SRH ప్లేయర్లు! ఇందుకేనా మిమ్మల్ని కొన్నది..
అనంతరం.. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 2 వికెట్లు కోల్పోయి 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75) సూపర్ బ్యాటింగ్‌తో మెరవగా.. రాహుల్ త్రిపాఠి(15 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్‌లతో 39 నాటౌట్), కేన్ విలియమ్సన్(40 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 32) రాణించారు. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి, డ్వేన్ బ్రావో తలో వికెట్ తీసారు.
A winning feeling that we’re going to remember throughout the night. 🧡#CSKvSRH #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/1O9sWzWckS
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2022
ఇది కూడా చదవండి: రెండో మ్యాచ్‌లోనూ ఓడిన SRH.. మాటలతోనే సరిపెట్టిన కేన్ మామ
ఇక.. చెన్నై తో మ్యాచ్ కు ముందు అభిషేక్ శర్మ గురుంచి అభిమానులు అన్న మాటలు అన్నీ ఇన్నీ కావు. తొలి రెండు మ్యాచుల్లో (రాజస్థాన్ రాయల్స్(19 బంతుల్లో 9 పరుగులు), లక్నో సూపర్ జెయింట్స్(11 బంతుల్లో 13 పరుగులు)) దారుణంగా విఫలమైన అభిషేక్ శర్మను పక్కనపెట్టాలని అభిమానులు సూచించారు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ మాత్రం అభిషేక్ శర్మకు మరో అవకాశం ఇచ్చింది. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వేలంలో రూ.6.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన మీ ప్లేయర్ ఎందుకు పనికిరాడంటూ హేళన చేశారు. ఫన్నీ మీమ్స్, తెలుగు డైలాగ్స్‌తో సెటైర్లు పేల్చారు. రాయలేని పదాలతో తీవ్ర విమర్శలు గుప్పించారు. వీటన్నిటికీ అభిషేక్ శర్మ తన బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు.
Abhi-Shook the bowling attack with a blitz that will be remembered. 🔥
Take a bow, @IamAbhiSharma4. 🧡#CSKvSRH #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/Xswb4VoAat
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2022
HALF-CENTURY! This. Is. Abhishek Sharma! 🔥#CSKvSRH #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/cw8A8n6bqy
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.