ఐపీఎల్ 2022 లో భాగంగా ఇవాళ(సోమవారం) సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాగ్ టైటాన్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి పట్టిన క్యాచ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ క్యాచ్‌పై తోటి ఆటగాళ్లతోపాటు ప్రేక్షకులు రాహుల్ త్రిపాఠిని అభినందించారు. ఈ సీజన్‌లోనే ఇది బెస్ట్ క్యాచ్‌గా నిలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక.. త్రిపాఠి క్యాచ్ పై భువి ఎక్సప్రెషన్ మాములుగా లేదు.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. మూడో ఓవర్ వేయడానికి బాల్ అందుకున్న భువనేశ్వర్ కుమార్ మొదటి బాల్ ని డాట్ పెట్టించాడు. ఇక..రెండో బంతిని గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ ఆఫ్‌సైడ్ బలంగా కొట్టాడు. అయితే.. ఆ బంతిని సన్‌రైజర్స్ ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి గాలిలో డైవ్ చేస్తూ ఎడమ చేతితో అద్భుతంగా పట్టుకున్నాడు. ఆ క్యాచ్ చూసి బౌలింగ్ వేసిన భువనేశ్వర్ కుమార్ కూడా నమ్మలేకపోయాడు. దీంతో అతని జట్టు సభ్యులంతా అభినందించారు. కామెంటేటర్లు సైతం ప్రశంసలు కురిపిస్తూ ఈ సీజన్‌లో ఇది బెస్ట్ క్యాచ్‌గా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్యాచ్ పై మీరు.. ఓ లుక్కేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Rahul Flying Tripathi 🥵 Best of the season #SRHVSGT pic.twitter.com/Bz7KSEytic
— SR 💫 (@SSRtweetz) April 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.