ఐపీఎల్ 2022 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ప్రారంభించింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల భారీ తేడాతో ఓడింది. కాగా ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ ఇచ్చిన తప్పుడు నిర్ణయంతో SRHకు భారీ నష్టం జరిగిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 211 పరుగుల భారీ లక్ష్య ఛేదన కోసం ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేన్ విలియమ్సన్(2) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రసిద్ద్ కృష్ణ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతి విలియమ్సన్ బ్యాట్ ఎడ్జ్ తీసుకోని కీపర్ వైపు దూసుకెళ్లగా.. సంజూ శాంసన్ సూపర్ డైవ్‌తో అందుకునే ప్రయత్నం చేశాడు.
అయితే బంతిని శాంసన్ సరిగ్గా అంచనా వేయకపోవడంతో గ్లోవ్స్‌కు తగిలి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్ వైపు వెళ్లింది. వెంటనే అలర్ట్ అయిన పడిక్కల్ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. అయితే బంతిని అందుకునే క్రమంలో అది నేలకు తాకినట్లు అనిపించింది. దాంతో ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ సమీక్షను కోరాడు. రిప్లేలో సైతం బంతి నేలకు తాకినట్లు స్పష్టంగా కనిపించింది. అయినా కూడా థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి(0) డకౌట్‌గా వెనుదిరగడంతో సన్‌రైజర్స్.. 7 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని SRH అభిమానులు తప్పుబడుతున్నారు. అంపైర్‌ది అత్యంత చెత్త నిర్ణయమని, రిప్లేను మరోసారి పరిశీలించకుండానే ఔటిచ్చాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పడిక్కల్ చేతి వేళ్లు బంతి కింద కూడా లేవని, బాల్ నేలకు తాకినట్లు స్పష్టంగా కనబడుతుందని ఆధారాలతో సహా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్ షమీ పర్ఫార్మెన్స్‌పై స్పందించిన పొర్న్‌స్టార్
What is this🙄🤔 Wrong decision by Umpire. Kane Williamson was Not Out👇👇 #RRvSRH #SRHvRR #KaneWilliamson #IPL2022 #Umpire pic.twitter.com/51GNpFnVQp
— Cricket Countdown (@Cric8Countdown) March 29, 2022
#KaneWilliamson was not out.poor 👎Umpiring in #IPL2022 This was given out by 3rd umpire.🤦 My sincere request to @SGanguly99
Just like,how players will go through fitness test before the game,please include”EYE CHECKUP”test for umpires.#SRHvRR #RRvsSRH#KaneWilliamson @Sivy62 pic.twitter.com/3zHqYinx11— 𝘼𝙗𝙝𝙞𝙨𝙝𝙚𝙠🇮🇳 (@Sachin10fans) March 29, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.