ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శనపై విమర్శలు తీవ్రమవుతున్నాయి. నిజానికి జట్టు ప్రదర్శన కంటే జట్టు ఎంపిక చేసిన ఫ్రాంచైజ్‌పై SRH ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఐపీఎల్ మెగా వేలం నుంచే ఈ విమర్శలు మొదలయ్యాయి. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఏకంగా 61 పరుగుల తేడాతో ఓటమితో ఆ విమర్శల మరింత ఎక్కువయ్యాయి.
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో కూడా ఓడిపోవడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ SRH ఫ్రాంచైజ్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. ముఖ్యంగా జట్టు సీఈఓ కావ్యా మారన్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. “మొత్తం మీరే చేశారు. ఒక్క సీజన్లో విఫలమైందుకు డేవిడ్ వార్నర్ భాయ్ ను అవమానకర రీతిలో బయటకు పంపించారు. రషీద్ ఖాన్ ను రిటైన్ చేసుకోలేదు. బెయిర్ స్టోను వదిలేశారు. జట్టును నాశనం పట్టించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మ్యాచ్ సందర్భంగా కావ్య హావభావాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. “”ఈ సీజన్ మొత్తం మీ ఎక్స్ ప్రెషన్స్ ఇలాగే ఉండబోతున్నాయి.’ ‘ఏం ఆడుతున్నార్రా బాబూ.. సన్ రైజర్స్ కు గడ్డు పరిస్థితులు తప్పవు” అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆటగాళ్ల ప్రదర్శనపై మేనేజ్‌మెంట్ కూడా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో వాళ్లు కూడా టీమ్‌పై సీరియస్‌గా ఉన్నట్లు తెలస్తుంది.
ఇదీ చదవండి: SRHలో ఇరగదీస్తున్న ఈ యంగ్‌స్టర్ పై రవిశాస్త్రి ప్రశంసలు!
Future prediction. #Kavya‘s expression will be this for the whole season. Mark my words. #SRH is below par in all categories. No hitters, no dependable players. Looks like this will be “the end” of good time of #SunrisersHyderabad #SRHvsLSG pic.twitter.com/mfCZHz9x5W
— Avis Indian☮️ (@ClanofGriffin) April 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.