ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శన అంచనాలకు తగ్గట్లు లేదు. తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసినా.. 4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్లు తీయకుండా.. 3 ఓవర్లు వేసి 39 పరుగులు ఇచ్చాడు. అయినా కూడా మ్యాచ్ అనంతరం అతనికి రూ.లక్ష రివార్డు లభించింది. ఉమ్రాన్ మాలిక్‌కు ఈ రివార్డు ఫాస్టెస్ట్ డెలివరీ విభాగంలో లభించింది. SRH ఆడిన రెండో మ్యాచ్‌లలో కూడా ఉమ్రాన్ మాలిక్ అత్యంత వేగవంతమైన బంతి వేశాడు.
లక్నోతో మ్యాచ్లో 152.4 కేఎంపీహెచ్(కిలో మీటర్ పర్ అవర్) వేగంతో బౌలింగ్ చేశాడు. అత్యంత వేగవంతమైన బంతికి.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు లభించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఈ అవార్డు ఉమ్రాన్ మాలిక్‌కే వరించింది. ఈ క్రమంలో.. సన్‌రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్‌కు రూ.లక్ష రుపాయాలు గ్యారంటీగా రావచ్చు. ఇప్పుడు ఐపీఎల్‌లో అత్యంత వేగంతో బౌలింగ్ చేసే బౌలర్ల జాబితాలో ఉమ్రాన్ మాలిక్ ముందు వరుసలో ఉన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL లో కొత్త రూల్స్! ఇలా.. అయితే టీంకి 20 మంది ఆడాలి!
Swiggy Instamart Fastest Delivery of the Match between @SunRisers and @LucknowIPL is Umran Malik.#TATAIPL @SwiggyInstamart #SwiggyInstamart #SwiggyInstamartFastestDelivery #SRHvLSG pic.twitter.com/Vo3NtHMN1q
— IndianPremierLeague (@IPL) April 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.