టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టీమిండియా యంగ్ ప్లేయర్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు కోపం తెప్పించాడు. సీనియర్ ప్లేయర్ ఇలా చేస్తుంటే.. కోపం అణుచుకుంటూ కళ్లల్లో నిప్పులు కురిపించాడు శ్రేయస్ అయ్యర్. ఈ సంఘటన ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆర్సీబీ బౌలర్లు అద్భుత బౌలింగ్‌కు కేకేఆర్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది.
వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా హసరంగా బౌలింగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి కేకేఆర్ స్కోర్ 46/4. శ్రేయస్ అవుట్‌ను ఆర్సీబీ ఆటగాళ్లు ఫుల్ జోష్‌లో సంబురాలు చేసుకున్నారు. అలాగే ఆ టీమ్ స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరింత ఉత్సాహంతో శ్రేయస్ అవుట్ అవ్వడాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆనందంతో గట్టిగా అరుస్తున్నాడు. ఆ సమయంలో అవుటై క్రీజ్ వదిలి వెళ్తున్న శ్రేయస్‌కు.. కోహ్లీ ఓవర్ ఎగ్జైట్‌మెంట్ అంతగా రుచించలేదు. వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉండడంతో తీవ్ర అసహనంతో ఉన్న శ్రేయస్‌కు కోహ్లీ ఎంజాయ్‌మెంట్ కోపం తెప్పినట్లు ఉంది. అందుకే.. బయటికి వెళ్తున్న సమయంలో కోహ్లీ కేసి కోపంగా చూశాడు శ్రేయస్.
ఈ సంఘటన కెమెరా కంటికి చిక్కింది. ప్రస్తుతం శ్రేయస్, కోహ్లీని కోపంగా చూస్తున్న ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటోపై మిశ్రమ స్పందన వస్తుంది. వరుసగా మూడు వికెట్లు వెంటవెంటనే పడితే బౌలింగ్ టీమ్ ఆ మాత్రం సంబరాలు చేసుకోవడం కామన్.. అంత మాత్రానికే శ్రేయస్ అంత కోపంగా చూడాలా? అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ కోహ్లీని వెనకేసుకోస్తున్నారు. అలాగే మోస్ట్ సీనియర్ ప్లేయర్ అయిన కోహ్లీ.. యంగ్ ప్లేయర్ అవుట్ అయితే ఇంత అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం లేదంటూ.. కేకేఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ తీసుకున్న డుప్లెసిస్!
— Sayyad Nag Pasha (@PashaNag) March 31, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.