గబ్బర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే.. శిఖర్ ధావన్ అభిమానులను సంతోషపరచడంలో ఎల్లప్పుడూ ముందుంటాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా కనిపించే ధావన్ సినిమా డైలాగ్స్, డ్యాన్స్‌లతో ఎన్నోసార్లు అలరించాడు. తాజాగా తన లవ్ స్టోరీ విషయాన్ని బయటపెట్టిన ధావన్.. ఆ అమ్మాయి తనను రిజెక్ట్ చేసిందని చెప్పుకొచ్చాడు. క్యాండిడ్ కాన్వర్జేషన్ పేరిట శశి దిమన్‌కు ఇచ్చిన ఫన్నీ ఇంటర్య్వూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇంటర్య్వూలో ధావన్ తన వ్యక్తిగత విషయాలను చాలానే పంచుకున్నాడు.
”అవి నేను క్రికెట్‌లో అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులు. ఆ సమయంలో ఒక అమ్మాయి(పేరు చెప్పలేను) బాగా నచ్చి ప్రపోజ్ చేశాను. కానీ, తను నన్ను రిజెక్ట్ చేసింది. ఎందుకంటే.. నేను అప్పట్లో కాస్త నల్లగా ఉండేవాడిని (ఇప్పుడు కూడా పెద్ద కలర్ కాదనుకోండి).. అంతే కాదు నా ముఖంపై మచ్చలు ఉండడంతో నా లవ్‌ను రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆమెకు నేను ఇచ్చిన కౌంటర్ సమాధానం ఎప్పటికి గుర్తుండిపోతుంది. నువ్వు కోహినూర్ డైమండ్‌ను రిజెక్ట్ చేశావు.. ఇలాంటివాడు నీకు మళ్లీ దొరక్కపోవచ్చు..” అంటూ ముసిముసిగా నవ్వాడు. ఈ వీడియోనూ పంజాబ్ కింగ్స్ తన ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: మ్యాక్స్‌వెల్ వీపుపై కోహ్లీ బాక్సింగ్.. ఆపై మసాజ్! వీడియో వైరల్
ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గబ్బర్ రెండు మ్యాచ్‌ల్లో 92 పరుగులు చేశాడు. ఏప్రిల్ 8న బ్రబౌర్న్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. 2010 లో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ధావన్ 149 వన్డేల్లో 6284 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి.ఇక.. 34 టెస్టుల్లో 2315 పరుగులు చేసిన ధావన్ 68 టి20ల్లో 1759 పరుగులు చేశాడు.
Working smart. Working strong. Can’t wait to get going 💪 @PunjabKingsIPL pic.twitter.com/OdmHH40f2P
— Shikhar Dhawan (@SDhawan25) March 26, 2022