ఐపీఎల్ 2022 లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. అనంతరం 166 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులకకే పరిమితమయ్యింది. రాజస్థాన్ విజయంలో యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. అయితే,,.. ఈ మ్యాచులో చాహల్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
విషయంలోకి వెళ్తే.. లక్నో సూపర్ జెయింట్స్ ఛేజింగ్ చేస్తుండగా రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ చాహల్ 18వ ఓవర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌లోని ఐదో బంతిని చాహల్ లెగ్ బ్రేక్ వేయగా.. అది కాస్తా బాగా టర్న్ అయ్యి వికెట్ కీపర్ సంజు శాంసన్ చేతుల్లోకి వెళ్లింది. వెంటనే ఫీల్డ్ అంపైర్ ఆ బంతిని వైడ్‌గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయంపై చాహల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అది ఎలా వైడ్ అవుద్ది అంటూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
— Vaishnavi Sawant (@VaishnaviS45) April 10, 2022
ఇది కూడా చదవండి: వీడియో: రాహుల్ గోల్డెన్ డక్ తో అతియా శెట్టి షాక్!
చాహల్ వేసిన బంతి వైడ్ కాదని కామెంటేటర్స్ కూడా పేర్కొనడం విశేషం. వైడ్ కాదంటూ చాహల్ అంపైర్‌తో వాదిస్తుండగా.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ వచ్చి సర్దిచెప్పాడు. ఆ బంతి వైడ్ కాదని తెలిసినా.. అంపైర్‌తో మాత్రం అతడు యేమి మాట్లాడకుండా చాహల్ కు బంతి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు కూడా అంపైర్ పై తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆ అద్దాలు తీస్తే కనిపిస్తుందిగా’ అని కామెంట్ చేస్తున్నారు.
150 @IPL wickets. Player of the Match. Purple Cap. 👑#RoyalsFamily | #HallaBol | #RRvLSG | @yuzi_chahal pic.twitter.com/twZ9OIOimU
— Rajasthan Royals (@rajasthanroyals) April 11, 2022
ఇది కూడా చదవండి: అశ్విన్ రిటైర్డ్ అవుట్.. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి
ఇక.. ఐపీఎల్‌లో చాహల్ ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో దుష్మంత చమీరాను ఔట్ చేయడం ద్వారా చాహల్ ఐపీఎల్ టోర్నీలో 150వ వికెట్ సాధించాడు. దాంతో ఐపీఎల్‌లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్న ఆరో బౌలర్‌గా రికార్డుల్లో కెక్కాడు. ఈ జాబితాలో డ్వేన్ బ్రావో 173 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. లసిత్ మలింగా 170 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
@yuzi_chahal yesterday, became the second-fastest bowler to clinch 150 wickets at the IPL 🙌#IPL2022 #cricket #champion #bowler #tournament #YuzvendraChahal #wicket #innings #iplt20matches #sportzcrazy #followus pic.twitter.com/Cx7Bpt49zT
— SportzCraazy (@sportzcraazy) April 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.