ఐపీఎల్ 2022లో గురువారం కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీని నమోదు చేసింది. ఢిల్లీ బ్యాటర్ రోమన్ పావెట్ 16 బంతుల్లోనే 33 పరుగులు చేసి ఢిల్లీకి విజయం అందించాడు. ఈ సీజన్‌లో ఆరంభంలో అంతగా ప్రభావం చూపని ఈ విండీస్ వీరుడు రెండు మ్యాచ్‌ల నుంచి తన సత్తా చాటుతున్నాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌కు హీరో అయిపోయాడు. కానీ.. పావెల్ హీరో అవ్వడానికి ముందు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో తెలుసుకుంటే.. అతను ప్రతి మ్యాచ్‌లో బాగా ఆడాలని ప్రతి క్రికెట్ ఫ్యాన్ కోరుకుంటాడు. చిన్నతన నుంచి పావెల్ కటిక పేదరికంలో పెరిగాడు.
తన తల్లి సింగిల్ పేరెంట్.. అయినా కూడా తన రెక్కల కష్టంపై పావెల్‌ను, అతని చెల్లిని కంటికి రెప్పాలా కాచుకుంది. తల్లి పడుతున్న కష్టాలు చూసి పావెల్ చలించిపోయేవాడు. అమ్మ, చెల్లి కోసం ఏదైన చేయాలని, వాళ్ల కష్టాలను దూరం చేయాలని గట్టిగా అనుకునేవాడు. పావెల్ సెకండరీ స్కూల్‌లో ఉన్నప్పుడు పావెల్ తన తల్లికి మాటిచ్చాడు. కష్టాలను దూరం చేసి, మంచి సౌకర్యాలతో కూడిన జీవితం ఇస్తానని అన్నాడు. దాని కోసం క్రికెట్‌పై ఆసక్తితో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో పావెల్ తొలి సారి పాల్గొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రూ. 2.8 కోట్లకు కొనుగోలు చేసింది.
దీంతో పావెల్ అనుకున్న స్థాయి వాళ్ల కుటుంబం వచ్చేసింది. దీంతో తల్లికి ఇచ్చిన మాటను పావెల్ నిలబెట్టుకున్నట్లు అయింది. జమైకాలోని ఓల్డ్ హార్బర్‌లో గల బానిస్టర్ జిల్లాలో 1993, జూలై 23న జన్మించిన పావెల్.. 2016లో శ్రీలంకతో జరిగిన వన్డేతో వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాది పాకిస్తాన్‌తో సిరీస్‌తో టీ20 ఫార్మాట్‌లోనూ అడుగుపెట్టాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2020లో పావెల్ తొలి సారి పాల్గొన్నాడు. ఎంతో మంది జీవితాలను మార్చేసిన ఐపీఎల్.. ఇప్పుడు పావెల్ జీవితాన్ని మార్చడంతో పాటు, అతని తల్లికిచ్చిన మాటను కూడా నిలబెట్టింది. మరి పావెల్ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Shardul Thakur: వీడియో: IPL హిస్టరీలోనే అత్యంత చెత్త బాల్ వేసిన శార్థుల్ ఠాకూర్!
Always good to contribute to a team win! pic.twitter.com/acTKEWZ6mk
— Rovman Powell (@Ravipowell26) April 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.